CPI Red Salute Rally: హైదరాబాద్ నగరంలో తెలంగాణ సాయుధ పోరాట యోధులను స్మరించుకుంటూ సీపీఐ రెడ్ సెల్యూట్ ర్యాలీ నిర్వహించింది. కవులు, కళాకారులతో కలిసి ముగ్దమ్ స్టాచ్యు నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు రెడ్ టీ షర్ట్స్ ధరించి ర్యాలీ కొనసాగింది.
ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ సీపీఐ నారాయణ మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చి బుస కొట్టింది.. తర్వాత సైలెంట్ అయ్యిందని, రేవంత్ కూల్చేయడం మంచిదే అని ఆయన అన్నారు. నాగార్జున మంచి నటుడు కావచ్చు.. కానీ కక్కుర్తి ఎందుకు అని ఆయన అన్నారు. సినిమా డైలాగులు కొట్టడం కాదు అని, బుకాయింపు మాటలు వద్దని.. క్షమాపణ చెప్పాలి నాగార్జున అని ఆయన అన్నారు. ఇన్నాళ్లు అనుభవించిన దానికి ప్రభుత్వంకి పరిహారం…
ప్రధాని నరేంద్ర మోడీ కుడిభుజంగా అదానీ.. మరోవైపు అదానీ ఇనుప కవచంలాగా మోడీ ఉన్నారని ఆరోపించారు.. సెబీ అనేది ఒక పవర్ ఫుల్ సంస్ధ.. అలాంటి సంస్థ కూడా అదానీకి కొమ్ముకాయడం ఏంటి? అంటూ విమర్శలు గుప్పించారు సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ.
రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూ కుంభకోణాలపై సమగ్ర విచారణ చేయాలని సీఎం చంద్రబాబు నాయుడుని సీపీఐ నేతలు కోరారు. ఒక్క కడప జిల్లాలోనే వేలాది ఎకరాల కబ్జాకు గురయ్యాయని సీఎం దృష్టికి తీసుకొచ్చారు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దహనంపై విచారణ చేయాలన్నారు.
CPI Narayana: సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ.. ఏపీ ఆస్తులు తీసుకోమని అప్పట్లో జగన్ తెలంగాణ ప్రభుత్వానికి చెప్పాడు అని గుర్తు చేశారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ స్వాగతిస్తున్నాం.. ఇద్దరు కలిసి మాట్లాడుకోవడం శుభ పరిణామం.. ఇది రాష్ట్రాలు ఇచ్చి పుచ్చుకొని ధోరణితో ఉండాలి..
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇచ్చినప్పటికీ అభివృద్ధి చేయలేదు, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రజలకు స్వేచ్ఛ లేకుండా చేశారు..