రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులను సంతృప్తి పరచాలేకానీ… బ్లాక్ మెయిల్ చేయడం తగదని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె. నారాయణ అన్నారు. తిరుపతిలోని స్థానిక బైరాగి పట్టెడలో ఉన్న సీపీఐ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉధృతం దాల్చుతున్న నేపథ్యంలో ఖమ్మం నందు ఆసుపత్రిలో ఉన్న కేసీఆర్ ఉద్యమ విరమణకు ప్రయత్నించగా తెలంగాణ ప్రజలు, ఊస్మానియా వర్శిటీ విద్యార్థులు తిరగబడటంతో తప్పనిసరి పరిస్థితుల్లో…
సీఎం జగన్‌తో మెగాస్టార్ చిరంజీవి భేటీ ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది. రాజ్యసభ సీటు కోసమే చిరంజీవి జగన్‌తో సమావేశమయ్యారంటూ వివిధ కోణాల్లో విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఈ వ్యాఖ్యలను వైసీపీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి ఖండించారు. మంత్రి బాలినేని వ్యాఖ్యలపై సీపీఐ నేత నారాయణ కౌంటర్ ఇచ్చారు. ఎవరు చెప్పేది నిజం, ఎవరు చెప్పేది అబద్ధం. ప్రజలకు నిజాలు చెప్పండి అని నారాయణ అన్నారు. కనుమ పండుగ రోజు కూడా కఠోర వాస్తవాలు చెప్పాల్సిన పరిస్థితి…
రాజకీయాల్లో ఎవరిమీదనైనా కామెంట్లు చేయాలన్నా, నిరసన తెలపాలన్నా సీపీఐ నేత రూటే సపరేటు. తాజాగా కేంద్ర ప్రభుత్వం చేనేత వస్త్రాలు, చెప్పులపై జీఎస్టీ విధించడం సిగ్గుచేటు అని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అంటున్నారు. తిరుపతిలో ఆయన కేంద్రంపై తీరుకి నిరసనగా తన చెప్పును తలపై పెట్టుకున్నారు. చెప్పులపై పన్ను విధించడంపై నిరసన తెలపడం తప్పేంటని ప్రశ్నించారు. జీఎస్టీతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. చేసామాన్య ప్రజానీకం వాడే పాదరక్షలపై కూడా జీఎస్టీని పెంచడం ఏంటన్నారు.చెప్పులపై…
ఏ అంశంపైనా ప్రజా ఉద్యమాలు చేయాలన్నా ఎర్ర పార్టీల స్టైలే వేరు.. ప్రజా సమస్యలపై వినూత్న రీతిలో నిరసన చేపట్టడం వారికే చెల్లుతుంది. తాజాగా కేంద్ర ప్రభుత్వంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలపై నిప్పులు చెరిగారు.చెప్పులను నెత్తిపై పెట్టుకున్న వినూత్నంగా నిరసన తెలిపిన నారాయణ. చెప్పులను వేసుకోవడం కాదు తలపై పెట్టుకునే దుస్థితికి బీజేపీ తీసుకొచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వం చెప్పులపై జీఎస్టీ…
సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ కుడి కాలికి గాయమైంది. మంగళవారం మధ్యాహ్నం చిత్తూరు జిల్లా రాయల చెరువు లీకేజీ, ముంపు ప్రాంతాలను పరిశీలించేందుకు రామచంద్రపురం మండలం కుప్పం బాదూరు కు చేరుకున్నారు. అక్కడి నుండి కొండపై కిలోమీటరు మేర నడుచుకుంటూ రాయల చెరువు కట్ట వద్ద కు చేరుకున్నారు. అయితే… కొండ నుండి దిగే సమయంలో నారాయణ కుడి కాలు బెణికింది. కాలుకు వాపు రావడంతో పైకి లేవలేక అక్కడే కూర్చున్నారు. అదే సమయంలో చెరువు…
ప్రస్తుతం ఏపీలో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో అమిత్ షా ఏపీ పర్యటన ఆసక్తి కరంగా మారుతోంది. తిరుపతిలో వచ్చే నెల 14న 29వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించనున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణ, కర్నాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్, లక్షద్వీవులకు చెందిన గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు, ముఖ్యమంత్రులు, రాష్ట్రాల హోంమంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, సలహాదారులు, ఇతర సీనియర్ అధికారులు…
సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ రాజకీయాల గురించి తప్ప మిగతా విషయాల గురించి అంతగా మాట్లాడరు. కానీ సినిమా తారల గురించి ప్రస్తావిస్తూ బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ స్వతంత్ర ఉద్యమాన్ని అవమానిస్తూ కంగనా రౌనత్ చేసిన వ్యాఖ్యలపై సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశానికి 1947లో వచ్చింది స్వాతంత్రం కాదు అని భిక్ష అని కంగనా పేర్కొనడంపై తీవ్రంగా…
మత్తు పదార్ధాల అక్రమ రవాణా వ్యవహారంలో ప్రముఖ వ్యాపారవేత్త ఆదానిపై దేశద్రోహం కేసు పెట్టాలి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. ఇక, మత్తు పదార్థాల రవాణాకు సహకరించిన వారిపైన చర్యలు ఉండాలని డిమాండ్ చేశారు.. రోజుకి వెయ్యికోట్లు సంపాదించడానికి ఆదానీ ఏమైనా మాయల పకీరా..? అంటూ ప్రశ్నించిన ఆయన.. డ్రగ్స్ ఎవరు తయారు చేస్తున్నారు.. ఎవరు సరఫరా చేస్తున్నారు.. వాళ్లను పట్టుకోవాలన్నారు. మానవ బలహీనతను ఆసరాగా చేసుకుని డ్రగ్స్ దందా జరుగుతోందని…
స్టీల్ ప్లాంట్ కోసం పవన్ కళ్యాణ్ చేస్తున్న పోరాటంపై నమ్మకం లేదు అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. 222రోజులుగా మహా ఉద్యమం జరుగుతుంటే మీకు ఇప్పటి వరకు కనిపించలేదా… ఢిల్లీలో ఆందోళనకు వైసీపీ వచ్చింది కానీ మీరు రాలేదు. మీకు ఢిల్లీలో పలుకుబడి వుంది గట్టిగా చెప్పండి….ఎందుకు చెప్పలేకపోతున్నారు అని అడిగారు. అక్కడకు వెళ్లి కాళ్ళుపట్టుకుని-ఇక్కడ మీసం తిప్పుతావా… ఇక్కడమో బీజేపీతో గుద్దులాట…..అక్కడేమో ముద్దులాటనా అన్నారు. ప్రజలకు నమ్మకద్రోహం చేయవద్దు….చేతకాకపోతే చేతకాదని చెప్పండి .…
విజయవాడ : బిగ్ బాస్ షో పై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్ర స్థాయి లో మండిపడ్డారు. అది బిగ్ బాస్ షో కాదని… బ్రోతల్ హౌస్ లా ఉందని ఫైర్ అయ్యారు. యువతీ యువకును గదిలో బంధించి ఏం చేయిస్తున్నారని… వినోదం పేరుతో వికృత చేష్టలను ఎలా సమర్ధిస్తామని ప్రశ్నించారు. నేటి యువతరానికి ఎటువంటి మసేజ్ లు ఇస్తున్నారని… ప్రజలు ఆదరిస్తున్నారు కదా అని… ఇష్టం వచ్చినట్లు చేస్తారా ? అని నిప్పులు చెరిగారు.…