మెగాస్టార్ చిరంజీవి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు మెగా బ్రదర్ నాగబాబు.. తాజాగా మెగా బ్రదర్స్‌పై కామెంట్లు చేసిన నారాయణ.. చిరంజీవి ఊసరవెళ్లి లాంటి వ్యక్తి అని.. ఆయన్ను అసలు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలకు తీసుకు రావాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు.. ఇక, పవన్ కల్యాణ్ ల్యాండ్ మైన్ లాంటి వాడు.. అది ఎక్కడ పేలుతుందో.. ఎవరిపై.. ఎప్పుడు పేలుతుందో కూడా తెలియదని..…
ఏపీలోని అధికార పార్టీ వైఎస్సార్సీపీకి శాశ్వత అధ్యక్షుడిగా సీఎం వైఎస్ జగన్‌ని నియమించటం చట్టవిరుద్ధమని సీపీఐ నారాయణ అన్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్-29ఏ ప్రకారం ఈ తీర్మానం చెల్లదని చెప్పారు. ఈ మేరకు ఆయన నిన్న ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు ఉన్న ఏ రాజకీయ పార్టీలో అయినా అంతర్గ ప్రజాస్వామ్యం ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఓట్ల ప్రక్రియ ద్వారానే అధ్యక్షుడు సహా మొత్తం కార్యవర్గాన్ని ఎన్నుకోవాలని తెలిపారు. నిబంధనలు కూడా…
గడ్డం పెంచినంత మాత్రానా సన్యాసి కాదంటూ.. జాతీయ కార్యదర్శి సీపీఐ నారాయణ సటైర్ వేశారు. జపాన్ పోతే 14 డ్రెస్ లు మార్చి.. మళ్లీ నేను సన్యాసిని అంటారు మోడీ అంటూ విమర్శించారు. బీజేపీ తెలంగాణ మీద దృష్టి పెట్టిందని మండిపడ్డారు. హిట్లర్ ఎలాగైతే మంచిమాటలు చెప్పి. గెలిచి దేశాన్ని ఆక్రమించినట్టు ఉంది బీజేపీ వ్యవహారం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ తక్కువ సీట్లు గెలిచిన చోట కూడా అధికారం కొల్లగొడుతున్నారని మండిపడ్డారు. మహారాష్ట్ర అయిపోయింది..…
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం గౌరవెల్లి నిర్వాసిత గ్రామవాసులపై పోలీసులు లాఠీఛార్జి చేయడంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న గౌరవెల్లి భూ నిర్వాసితులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జి చేయడం దారుణమని అన్నారు. లాఠీఛార్జ్ చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణంలో సీపీఐ పాత్ర కూడా ఉందని, అక్కడ ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా తమ పార్టీ కాపాడిందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణం…
పేదల గుడిసెలు జోలికి వస్తే వరంగల్ ని స్తంభింప చేస్తామని, సీఎంకు చిత్తశుద్ది ఉంటే వరంగల్ లో పేదలకు ఇండ్ల పట్టాలు ఇవ్వాలని సీపీఐ నారాయణ మండిపడ్డారు. హన్మకొండలో ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకున్న పేదలకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బాలసముద్రం ఏకాశిలా పార్క్ వద్ద సీపీఐ ఆధ్వర్యంలో భారీ ధర్నా చేపట్టారు. ఈ ధర్నలో పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్ర, జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకులు పాల్గొన్నారు. ఈ ధర్నలో గుడిసె వాసులు…
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తలపెట్టిన మహిళా దర్బార్ కార్యక్రమంపై సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ తమిళిసై లక్ష్మణరేఖ దాటుతున్నారని ఆయన అన్నారు. మహిళా దర్బార్ అసలెందుకు పెడుతున్నారని ప్రశ్నించారు. సహజంగా ఎవరైనా ప్రతినిధి వస్సే కలవచ్చని.. వారిచే వినతిపత్రాన్ని తీసుకుని ప్రభుత్వానికి పంపవచ్చాన్నారు. కానీ రాజకీయ కార్యకలాపాల కోసం రాజ్‌భవన్‌ను దుర్వినియోగం చేస్తున్నారని నారాయణ అన్నారు. రాష్ట్రంలో ఓవైపు భాజపా రాజకీయ దాడిని పెంచిందని, మరోవైపు గవర్నర్ పాత్ర అగ్నికి ఆజ్యం…