విశాఖలో సంచలనం సృష్టించిన క్రికెట్ బెట్టింగ్ కేసులో పోలీసులు స్పీడ్ పెంచారు. ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. అందుకోసం 3 వింగ్స్ ఏర్పాటు చేశారు. టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా బుకీలా వివరాలు కనుకుంటున్నారు పోలీసులు.
విశాఖపట్నంలో సంచలనం సృష్టించిన క్రికెట్ బెట్టింగ్ కేసులో పోలీసులు దూకుడు పెంచారు... క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్న ముఠా సభ్యుల్లో ఇప్పటికే 8 మందిని అరెస్ట్ చేసామన్నారు పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి.. ఈ ముఠాతో పెద్ద తలకాయలకు సంబంధాలు ఉన్నాయని, వాళ్లను కచ్చితంగా పట్టుకుంటామన్నారు.. క్రికెట్ బెట్టింగ్ లో ఇన్వాల్వ్ అయిన ఓ హెడ్ కానిస్టేబుల్ ని సస్పెండ్ చేసి ఎంక్వయిరీకి ఆదేశించామన్నారు..