చిన్నారులు, యువతులు అనే తేడా లేకుండా.. చదువుకునే ప్రాంతంలోనూ లైంగిక వేధింపులకు గురవుతున్నారు.. విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువులే పాడుబుద్ధి చూపిస్తున్నారు.. బోధనేతర సిబ్బంది కూడా చిన్నారులపై లాంగిక దాడులకు పాల్పడిన ఘటనలు ఎన్నో.. అయితే, వీటిపై దృష్టిసారించిన తెలంగాణ ప్రభుత్వం.. ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చేందుకు సిద్ధమైంది.. ఈ విషయాన్ని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీబీ ఆనంద్ వెల్లడించారు.. చిన్నారులు, యువతుల రక్షణపై హైదరాబాద్ సీపీ కీలక వ్యాఖ్యలు.. స్కూళ్లు, కాలేజీల్లో అమ్మాయిల మీద అఘాయిత్యాలపై ప్రత్యేక చట్టం…
సీపీ సీవీ ఆనంద్‌పై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అయ్యారు. హైదరాబాద్ లో రాత్రి నుంచి పెట్రోల్ బంక్ లు ఎందుకు బంద్ చేశారో చెప్పాలని అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అయ్యారు. మా పండుగలకు పెట్రోల్ బంక్‌లు బంద్ ఎందుకు చేయిస్తున్నారని ప్రశ్నించారు.
హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ మరోసారి పట్టుబడింది. డార్క్ వెబ్ ద్వారా కన్జూమర్స్ డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నారు. గోవా, రాజస్థాన్, ఢిల్లీకి చెందిన డ్రగ్ పెడ్లర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరు అంతర్రాష్ట్ర డ్రగ్ పెడ్లర్స్‌తో పాటు ఆరుగురు హైదరాబాద్ వాసులు అదుపులో తీసుకున్నారు. దేశవ్యాప్తంగా డార్క్ వెబ్ ద్వారా వేలాది మందికి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. డార్క్ వెబ్ నెట్‌వర్క్‌ను హెచ్‌న్యూ టీమ్ రంగ ప్రవేశంతో బట్టబయలు చేశారు. పోలీసులకు చిక్కిన వారంతా ఉన్నత విద్యావంతులే…
జూబ్లీహిల్స్ అత్యాచార ఘటనపై టీ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీపీ సీవీ ఆనంద్ చెప్పిన విధానం చూస్తుంటే.. అవసరమైన వాళ్లను తప్పించే ప్రయత్నం చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. ఈ సంఘటనలో నిందితులు, బాధితురాలు ప్రయాణించిన బెంజ్ కారు, ఇన్నోవా ముఖ్యమైన ఆధారాలని ఆయన అన్నారు. మైనర్లు వాహనాలు నడిపితే, యజమానులకు సమాచారం అందించాలని..ఎంపీ యాక్ట్ ప్రకారం యజమానులను పోలీస్ స్టేషన్ కు పిలవాలని.. లేదంటే వాళ్లపై కేసులు పెట్టాలని…
హైదరాబాద్ నగరంలో సంచనలం రేపిన జూబ్లీహిల్స్ ఆమ్నేషియా పబ్ అత్యాచారం కేసులో లోతుగా దర్యాప్తు చేశామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. మొత్తం ఆరుగురు నిందితులను అరెస్టు చేశామని, వీరిలో ఒక్కరే మేజర్ అని తెలిపారు. కేసులో ఐదుగురు మైనర్లు ఉన్నారు కాబట్టి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పేర్లు వెల్లడించడం లేదన్నారు. వారందరిపై పోక్సో చట్టం కింద కేసు నమోదుచేశామన్నారు. అయితే ఆరో వ్యక్తి బాధితురాలిపై రేప్ చేయలేదన్నారు. రేప్ చేసిన నిందితులకు 20 ఏళ్ల…