Asaduddin Owaisi: సీపీ సీవీ ఆనంద్‌పై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అయ్యారు. హైదరాబాద్ లో రాత్రి నుంచి పెట్రోల్ బంక్ లు ఎందుకు బంద్ చేశారో చెప్పాలని అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అయ్యారు. మా పండుగలకు పెట్రోల్ బంక్‌లు బంద్ ఎందుకు చేయిస్తున్నారని ప్రశ్నించారు. ఇతర పండుగలకు ఎందుకు బంద్ చేయించరు? అని ప్రశ్నలు గుప్తించారు. నువ్వు నిజాం కాలేజ్ లోనే చదువుకున్నావ్.. నేను నిజాం కాలేజీలో చదువుకున్నాం అంటూ దీని వల్ల ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారో చెప్పాలని ప్రశ్నించారు. (Milad Un Nabi) మిలాద్- ఉన్ -నబీ పండుగ సందర్భంగా నగరంలోని ముస్లీం ప్రాంతాల్లో నగరంలోని పెట్రోల్ బంక్ లు ఎందుకు మూసివేస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. ఇలాంటి వ్యవహారాలు చేయడం కరెక్ట్ కాదని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
నగంలో ట్రాఫిక్ ఆంక్షలు..
మిలాద్ ఉన్ నబీ పండుగ నేపథ్యంలో నేడు మహమ్మద్ ప్రవక్త జయంతిని ముస్లింలు ఘనంగా జరుపుకుంటున్నారు. ముస్లింలు ఈరోజును పవిత్ర దినంగా భావిస్తారు. మసీదుల్లో ప్రవక్త మహమ్మద్‌ను స్మరిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. మసీదుల్లో ఖురాన్ పఠనం, ప్రసంగాలు నిర్వహిస్తారు. ఈద్ మిలాద్ ఉన్ నబీ సందర్భంగా హైదరాబాద్ లో ముస్లిం సోదరులు భారీ ఊరేగింపు నిర్వహించనున్నారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా హైదరాబాద్ పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ప్రయాణికులు, వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించి దారి మళ్లించారు. బేగంపేట ఫ్లైఓవర్, లంగర్ హై ఫ్లైఓవర్, డబీర్ పురా ఫ్లైఓవర్, లాలాపేట ఫ్లైఓవర్, పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ మినహా మిగిలిన ఫ్లై ఓవర్లను ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మూసివేస్తామని స్పష్టం చేశారు. చార్మినార్, సాలార్ జంగ్ మ్యూజియం, ఫలక్ నుమా ఎక్స్ రోడ్స్, లాలా దర్వాజా ఎక్స్ రోడ్స్, గుల్జార్ హౌస్, మదీనా, నయాపూర్ బ్రిడ్జి, ఎతేబార్ చౌక్, పురానీ హవేలీ, క్వాద్రీ చమన్, గులాం ముర్తుజా కాలనీతోపాటు పలు ప్రాంతాల్లో వాహనదారులు దారి మళ్లించారు.
Vivek Agnihotri: బాలీవుడ్‌కు ముస్లింల సహకారం.. శరద్ పవార్ వ్యాఖ్యలతో నా సందేహాలు తీరాయి..