హైదరాబాద్‌లో నెలకొన్ని ట్రాఫిక్ సమస్యలపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వివరించారు. డయల్ 100కు 70 నుంచి 80 శాతం ట్రాఫిక్ సమస్యల పై వస్తున్నాయని, ట్రాఫిక్ సమస్య విపరీతంగా పెరిగిపోయిందన్నారు. ట్రాఫిక్ ఫ్రీ ఫ్లోను మేయింటెయిన్ చేయాలంటే క్యారేజ్ వే ఫ్రీగా ఉండాలన్నారు. అప్పుడే వాహనాలు రాకపోకలు సజావుగా సాగుతాయని, కోవిడ్ ఇబ్బందులతో ఎన్‌ఫోర్స్ మెంట్ సీరియస్ గా చేయడం లేదన్నారు. ఆపరేషన్ రోప్ ను ప్రారంభిస్తున్నామని ఆయన వెల్లడించారు. రాబోయే రోజుల్లో ప్రతి పీఎస్ లో రెండు టోయింగ్ క్రేన్ లను ఏర్పాటు చేస్తున్నామని, పార్కింగ్ సౌకర్యం లేకుండా కమర్షియల్ కాంప్లెక్స్ లను ఏర్పాటు చేయడం చట్ట వ్యతిరేకమన్నారు. జీహెచ్ఎంసీ తో కలిసి ట్రాఫిక్ సిబ్బంది ఎన్‌ఫోర్స్‌మెంట్ చేస్తామని, రోడ్ల పైకి సామాగ్రిలను పెడుతున్నారని, పట్టించుకోకపోవడంతో క్యారేజ్ వే ను ఆక్రమిస్తున్నారన్నారు. బాస్ బే లను రివైవ్ చేస్తున్నామని, బస్టాప్ లను ఆర్‌టీసీ అధికారులతో మాట్లాడి రీలొకేట్ చేపిస్తామన్నారు. ఆర్‌టీసీ డ్రైవర్లకు కౌన్సిలింగ్, అవేర్ నెస్ కార్యక్రమలను ఇస్తామని, ఆటో డ్రైవర్ల సమస్య చాలా ఉందన్నారు. వీలైనంత వరకు ఆటో స్టాండ్ లను ఏర్పాటు చేసి, ఉల్లంఘించే వారి పై ఎన్‌ఫోర్స్ మెంట్ చేస్తామని, ఒక్కో సమయంలో ఒక్కో ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయన్నారు.
క్వాంటిటీ కాదు క్వాలిటీ ఆఫ్ ఎన్‌ఫోర్స్మెంట్ పై దృష్టి పెడుతున్నట్లు ఆయన వివరించారు. ట్రాఫిక్ క్రమశిక్షణ ఖచ్చితంగా ఉండాలని, ఎన్నో రకాల నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని, క్వాలిటీ వచ్చేవరకు సీరియస్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఉంటుందని, కానిస్టేబుల్ నుండి అదనపు కమిషనర్ ట్రాఫిక్ వరకు రోడ్డుపై ఉంటారని, టెక్నాలజీ పరంగా రాబోయే రోజుల్లో లైవ్ అప్డేట్స్ చెప్పేలా గూగల్‌తో కలిసి చర్యలు చేపట్టబోతున్నామన్నారు. స్టాప్ లైన్ డిస్‌ప్లేన్ వాహనదారులకు ఉండాలని, చాలామందికి జీబ్రా లైన్‌లపై అవగాహన లేదని, ఎక్కడైతే స్టాప్‌లైన్, జీబ్రాలైన్ లేవో అక్కడ ఏర్పాటు చేస్తామన్నారు. వీటిపై వాహనదారుల్లో అవగాహన పెంచాలని, ఫ్రీ లెఫ్ట్ ఉల్లంఘించే వారిపై సీరియస్ గా చర్యలు తీసుకుంటామన్నారు.