మహబూబాబాద్ జిల్లా మరిపెడ ఎస్‌ఐ శ్రీనివాస్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. తనపై అత్యాచారం చేశాడంటూ ట్రైనీ ఎస్సై ఆరోపించారు.. ఎస్సై శ్రీనివాస్‌రెడ్డిపై పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన సీపీ తరుణ్ జోషి.. ఎస్సైని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, తనను ఎస్‌ఐ శ్రీనివాస్ రెడ్డి లైంగికంగా వేధించినట్లు అదే పీఎస్‌కు చెందిన మహిళా ట్రైనీ ఎస్సై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.. సోమవారం రాత్రి ఆకస్మిక తనిఖీ పేరుతో ఒంటరిగా తనను అడవిలోకి తీసుకెళ్లి ఎస్సై… ఆపై లైంగిక దాడికి పాల్పడినట్టు బాధితురాలు ఆరోపిస్తోంది.. తనకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులతో కలిసి వరంగల్ సీపీని ఆశ్రయించింది. దీంతో ఎస్సైపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్టుగా తెలుస్తుండగా.. మరోవైపు శాఖాపరమైన చర్యలు తీసుకుంటూ.. శ్రీనివాస్‌రెడ్డి సస్పెండ్ చేశారు సీపీ.