హైదరాబాద్ పోలీస్ కమీషనర్‌గా సీవీ ఆనంద్ ఈరోజు బాధ్యతలు చేపట్టబోతున్నారు. హైదరాబాద్ సీపీ ఉన్న అంజనీ కుమార్‌ను ఏసీబీ డీజీగా బదిలీ చేశారు. తెలంగాణలో 30 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈరోజు సీవీ ఆనంద్ బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇక హైదరాబాద్ పోలీస్ కమీషనర్‌తో పాటు సీనియర్ ఐపీఎస్, వివిధ నగరాల కమీషనర్లను కూడా బదిలీ చేశారు. సిద్ధిపేట, నిజామాబాద్ పోలీస్ కమీషనర్లతో పాటు 11 జిల్లాల ఎస్పీలు కూడా బదిలీ అయ్యారు. మూడేళ్ల క్రితం ప్రభుత్వం ఐపీఎస్‌లను బదిలీ చేసింది. ఆ తరువాత మరలా ఇప్పుడు ఈ స్థాయిలో బదిలీలు జరిగాయి. అయితే, రాచకొండ కమీషనర్ సీపీ భగవత్‌ను బదిలీ చేయలేదు. దీంతో మరో విడత బదిలీల కార్యక్రమం ఉండే అవకాశం ఉండొచ్చని సమాచారం.