టాప్ హీరోల నటవారసులు జనాన్ని తమవైపు తిప్పుకొనే ప్రయత్నంలో తండ్రులను గుర్తుకు తెచ్చే పాత్రల్లో తప్పకుండా నటిస్తూ ఉంటారు. తెలుగునాట తొలి కౌబోయ్ హీరోగా పేరొందిన నటశేఖర కృష్ణ వారసుడు మహేశ్ బాబు కూడా అదే పంథాలో పయనించారు. మహేశ్ ను కౌబోయ్ గా చూపిస్తూ జయంత్ సి.పరాన్జీ స్వీయ దర్శకత్వంలో ‘టక్కరి దొంగ’ అనే ట్రెజర్ హంట్ మూవీని నిర్మించారు. పైగా ఒకప్పుడు కృష్ణ ‘టక్కరిదొంగ -చక్కనిచుక్క’ అనే చిత్రంలో నటించారు. అందులోని టైటిల్ లో…