5-11 ఏళ్ళ లోపు చిన్న పిల్లలకు తమ టీకా సురక్షితమని ప్రకటించింది ఫైజర్. ఇప్పటికే క్లినికల్ ట్రయల్స్ సక్సెస్ అయ్యాయి అని స్పష్టం చేసింది. తమ టీకా తీసుకున్న చిన్నారులలో యాంటీబాడీస్ ప్రతిస్పందన కనిపిస్తోందని తెలిపింది ఫైజర్. ఐదేళ్ల నుంచి 11 ఏళ్ల లోపు చిన్నారుల విషయంలో తాము రూపొందించిన కరోనా వ్యాక్సిన్ సమర్థవంతంగా పని చేస్తున్నట్లు ప్రకటించాయి ఫైజర్ మరియు బయోఎన్ టెక్ సంస్థలు. క్లినికల్ ట్రయల్స్ లో సమర్థంగా పని చేస్తున్నట్లు నిర్ధారించాయి ఈ…
ఆఫ్రికాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికీ ఆ ఖండంలో నిత్యం దాదాపు రెండున్నర లక్షల కేసులు నమోదవుతున్నాయి. కనీసం 28 దేశాలలో రోజు వారీ కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. ఓ వైపు డెల్టా వేరియంట్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరగటం..మరో వైపు వ్యాక్సనేషన్ ప్రక్రియ అత్యంత మందకొడిగా సాగటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 600 కోట్ల డోసులు ఇచ్చారు. మన దేశంలో కూడా టీకా ప్రక్రియ జోరుగా సాగుతోంది. 25 శాతం…
ఇండియాలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా కరోనా బులిటెన్‌ను విడుదల చేసింది. ఈ బులిటెన్ ప్రకారం, గడిచిన 24 గంటల్లో ఇండియాలో 30,256 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 33,478, 419 కి చేరింది. ఇందులో 3,27,15,105 మంది కోలుకొని డిశ్చార్జ్‌కాగా, 3,18,181 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక, గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 309 మంది మృతి…
అమెరికాలో కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మరలా పెరుగుతున్నాయి. కేసులతో పాటుగా గత వారం రోజుల నుంచి మరణాల సంఖ్యకూడా భారీగా పెరుగుతున్నది. ప్రతిరోజూ 2 వేలకు పైగా మరణాలు నమోదవుతున్నాయి. కోవిడ్‌తో శుక్రవారం రోజున అత్యధికంగా 2,579 మరణాలు సంభవించాయి. సగటున ప్రతిరోజూ 2,012 మరణాలు సంభవిస్తున్నాయని న్యూయార్క్ టైమ్స్ పేర్కొన్నది. దేశంలోని ఫ్లోరిడా, టెక్సాస్, క్యాలిఫోర్నియా రాష్ట్రాల్లో అత్యధికంగా మరణాలు, కేసులు నమోదవుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా డెల్టా వేరియంట్…
కరోనా కారణంగా ఎక్కడ వ్యక్తులు అక్కడే ఆగిపోయారు. కరోనా మహామ్మారి కారణంగా పర్యాటకంగా అభివృద్ధి చెందిన దేశాలు ఇబ్బందులు పడుతున్నాయి. నిత్యం పర్యాటకులతో కలకలలాడే థాయ్‌ల్యాండ్ ఇప్పుడు బోసిపోయింది. కరోనా కారణంగా ఆ దేశానికి వచ్చేందుకు పర్యాటకులు ఆలోచిస్తున్నారు. రోడ్లపై నిత్యం పరుగులు తీసే క్యాబ్‌లు షెడ్డుకే పరిమితం అయ్యాయి. షెడ్డుకే పరిమితమైన క్యాబ్‌లపై గార్డెన్ ను పెంచాలని క్యాబ్ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. క్యాబ్‌లపై వెదురుకర్రలతో ఒక చిన్న తొట్టిలాగా ఏర్పాటు చేసి అందులో మట్టి…
మన దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా కరోనా బులిటెన్‌ను విడుదల చేసింది. ఈ బులిటెన్ ప్రకారం, గడిచిన 24 గంటల్లో ఇండియాలో 30,773 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,34,48,163 కి చేరింది. ఇందులో 3,26,71,167 మంది కోలుకొని డిశ్చార్జ్‌కాగా, 3,32,158 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక, గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 309 మంది మృతి…
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూ, తగ్గుతూ ఉన్నాయి. అయితే రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 60,350 శాంపిల్స్ పరీక్షించగా… 1,393 మందికి పాజిటివ్‌గా తేలింది… మరో 08 మంది కరోనా బాధితులు కన్నుమూశారు.. ఇదే సమయంలో 1,296 మంది కోవిడ్ బాధితులు కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. ఇక, తాజా కేసులతో కలుపుకొని.. రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,36,179 కు చేరగా.. 20,07,330…
రెండేళ్ల క్రితం 2019 డిసెంబర్‌లో చైనాలోని వూహాన్ నగరంలో మొదటి కరోనా కేసు నమోదైంది. ఆ తరువాత అక్కడి నుంచి ఈ వైరస్ ప్రపంచం మొత్తం వ్యాపించింది. వైరస్ వ్యాప్తి తరువాత ఇప్పుడు మరోసారి చైనాలో కేసులు వెలుగుచూస్తున్నాయి. చైనాని దక్షిణ ప్రావిన్స్‌లో కేసులు నమోదవుతున్నాయి. దీంతో దక్షిణ రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో తిరిగి లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నారు. డెల్టావేరియంట్ కేసులు పెరుగుతుండటంతో నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. పుతియాన్ నగరంలో కేసులు పెరుగుతున్నాయి.…
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆస్పత్రి లో చేరారు. హైదరాబాద్ లోని జూబ్లిహిల్స్ అపోలో ఆస్పత్రి లో చేరారు మంత్రి బొత్స సత్య నారాయణ. అయితే… మంత్రి బొత్స సత్యనారాయణ…. ఎందుకు ఆస్పత్రి లో చేరారనే దాని పై ఎలాంటి సమాచారం లేదు. కానీ ఆయన కరోనా చికిత్స నిమిత్తం ఆస్పత్రి లో చేరినట్లు సమాచారం అందుతోంది. గత రెండు రోజుల నుంచి మంత్రి బొత్స… కరోనా లక్షణాలతో బాధపడుతున్నారని… ఈ…