ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మరోసారి భారీగా పెరిగింది. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 49, 568 శాంపిల్స్ పరీక్షించగా.. 1125 కోవిడ్ పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి.. మరో 09 మంది కోవిడ్ బాధితులు మృతిచెందారు.. ఇక ఇదే సమయంలో 1,356 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. తాజా టెస్ట్‌లు కలుపుకుని ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కోవిడ్ నిర్ధారణ పరీక్షల సంఖ్య…
ఏపీలో కరోనా కేసులు పెరుగుతూ, తగ్గుతూ వస్తున్నాయి. నిన్న ఉదయం 9 గంటల నుంచి ఈరోజు ఉదయం 9 గంటల వరకు 45,553 శాంపిల్స్‌ను పరీక్షించగా, 1,190 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,29,985 కి చేరింది. ఇందులో 20,00,877 మంది కోలుకొని డిశ్చార్జ్ అయినట్టు బులిటెన్‌లో పేర్కొన్నారు. 24 గంటల్లో రాష్ట్రంలో 1,226 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇకపోతే, రాష్ట్రంలో…
కేరళను నిఫా వైరస్ వణికిస్తోంది. కోజికోడ్‌లో 12ఏళ్ల బాలుడు నిఫాతో మరణించినట్లు ఆరోగ్యశాఖ ప్రకటించింది. కేంద్రం కూడా ప్రత్యేక బృందాన్ని రాష్ట్రానికి పంపింది. నిపా వైరస్‌కు వైద్యం లేదు. ఇప్పటి వరకు అనుమతి పొందిన ఏ ఔషధం అందుబాటులోకి రాలేదు. మోనోక్లోనల్ యాంటీ బాడీస్ చికిత్స విధానం వినియోగించడంపై పరిశీలిస్తున్నారు. కాకపోతే ఇది వేగంగా వ్యాపించకపోవడం ఒక్కటే ఊరటనిచ్చే అంశం. మొత్తం కేరళలో ఇప్పటివరకు 19 మందికి వైరస్ సోకితే 17 మంది మరణించారు.కేరళలో కరోనా మహమ్మారి…
చైనాలో పుట్టిన కరోనా వైరస్ ఎవరినీ వదలడం లేదు. పేద, ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ కరోనా మహమ్మారి సోకుతోంది. ఇప్పటికే చాలా మంది రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు ఇతరులు ఇలా చాలా మంది కరోనా బారీన పడ్డారు. అయితే.. తాజాగా పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి కి కూడా కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయింది. రెండు రోజులుగా అస్వస్థతకు గురైన ఆయన… ఇవాళ కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అయితే..…
కోవిడ్ టీకాపై అపోహలు అవసరం లేదని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలిపారు. స్వర్ణభారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉభయ తెలుగురాష్ట్రాల్లోని మూడు కేంద్రాల్లో ఉచిత కోవాగ్జిన్ టీకా పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. టీకాకరణ కార్యక్రమం ప్రజాఉద్యమంగా రూపుదాల్చాల్సిన అవసరం ఉందని… టీకానంతరం కూడా జాగ్రత్తలు పాటించాల్సిందేనని పేర్కొన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. అసాధారణ సంక్షోభాన్ని అసాధారణ రీతిలోనే ఎదుర్కోవాలి, ఇందులో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.…
తెలంగాణలో ఇంటర్ అకడమిక్ క్యాలెండర్‌ను విడుదల చేశారు. 220 పనిదినాలతో…. రెండు టర్మ్‌లుగా అకడమిక్ ఇయర్ ఉంటుందని ఇంటర్ బోర్డు ప్రకటించింది. సెప్టెంబర్ ఒకటి నుంచి డిసెంబర్ 18 వరకు మొదటి టర్మ, డిసెంబర్ 20 నుంచి ఏప్రిల్ 13 వరకు సెకండ్ టర్మ్ ఉంటుందని తెలిపారు. డిసెంబర్ 13 నుంచి 18 వరకు హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్, మార్చి 23 నుంచి ఏప్రిల్ 12 వరకు ఇంటర్ ఫైనల్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. ఈ ఏడాది వందశాతం…
గత ఏడాదిన్నర కాలం నుంచి ప్రపంచాన్ని కరోనా అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నది. కొన్ని దేశాలు కరోనా నుంచి బయటపడి తిరిగి అభివృద్ధి వైపు అడుగులు వేస్తుండగా, కొన్ని దేశాలు తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. అనేక దేశాల్లో కరోనా నుంచి ఇంకా కోలుకోలేదు. పర్యాటకంపై ఆధారపడే దేశాల్లో కరోనా ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ఇలా సంక్షోభంలో కూరుకుపోయిన దేశాల్లో శ్రీలంక కూడా ఒకటి. శ్రీలంక పర్యాటకంపై ఆధారపడిన దేశం కావడంతో ఆ దేశం అన్ని రకాలుగా ఇబ్బందులు…
తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 230 కరోనా కేసులు నమోదైనట్టు రాష్ట్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నది. రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,59, 543 కి చేరింది. ఇందులో 6,50,114 మంది ఇప్పటికే కోలుకొని డిశ్చార్జ్ కాగా, 5,545 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో కరోనాతో ఒకరు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు మృతి చెందినవారి సంఖ్య 3884 కి చేరింది.…
భారత జట్టులో కరోనా కలకలం రేపింది. టీం ఇండియా హెడ్ కోచ్ రవి శాస్త్రికి కరోనా పాజిటివ్ గా తేలింది. నిన్నటి నుంచి కాస్త అస్వస్థకు గురైన ఆయన… ఇవాళ కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అయితే… ఈ కరోనా పరీక్షల్లో కోచ్ రవి శాస్త్రికి కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో కోచ్ రవి శాస్త్రి కి హోం క్వారంటైన్ లోకి వెళ్లారు. అలాగే… రవి శాస్త్రి తో సన్నిహితంగా ఉన్నటు వంటి బౌలింగ్ కోచ్ అరుణ్,…
దేశంలో కరోనా వ్యాక్సినేషన్‌ను వేగంగా అమలుచేస్తున్నారు. ప్రతిరోజూ కోటి మంది వరకు టీకాలు తీసుకుంటున్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలోనూ వ్యాక్సినేషన్‌ను వేగంగా అమలు చేస్తున్నారు. ఇప్పటికే విద్యాసంస్థలను ఒపెన్ చేశారు. అర్హులైన ప్రతి విద్యార్ధి, ఉపాద్యాయులు, నాన్ టీచింగ్ స్టాఫ్ టీకాలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. ప్రధానోపాద్యాయులు, పీహెచ్‌సీలు సమన్వయంతో టీకాలు వేయాలని, ఈ విషయంలో కలెక్టర్లు చొరవ తీసుకోవాలని ప్రభుత్వం తెలిపింది. సెప్టెంబర్ 10 వ తేదీలోగా విద్యాసంస్థల్లో 100శాతం వ్యాక్సినేషన్ పూర్తికావాలని ఆదేశించింది.…