కరోనా వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ తప్పని సరిగా నిబంధనలు పాటించాలి. నిబంధనలు పాటించకుంటే వ్యాక్సిన్ తీసుకున్నా ఎంతమాత్రం సురక్షితం కాదన్నది వాస్తవం. ముఖానికి మాస్కులు తప్పని సరి. అయితే, అందరికి మెడికేటెడ్ ఎన్ 95 మాస్కులు లభ్యం కాకపోవచ్చు. కానీ, ఇంట్లో తయారు చేసుకొని వినియోగించే మాస్కులు కూడా సురక్షితం అని రీసెంట్ సర్వేలు చెబుతున్నాయి. ఎలాంటి గుడ్డతో తయారు చేసిన మాస్కులు సురక్షితం అంటే కాటన్ గుడ్డతో చేసినవి మంచివని సర్వేలు చెబుతున్నాయి. ఇక కాటన్ గుడ్డతో తయారు చేసిన మాస్కులపై ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. ఫిజో ఎలక్ట్రిక్ ఆధారంగా డ్రాప్లెట్ డిస్పెన్సర్‌ను సృష్టించి దగ్గు తుమ్ము తుంపరలను రకరకాల వస్త్రాలతో తయారు చేసిన మాస్క్‌లపై ప్రయోగించారు. కాటన్‌తో తయారైన మాస్కులు ఈ తుంపరలను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాయని, కాటన్ మాస్కులను ధరించడం ఉత్తమం అని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. వీటిని 70 సార్లు వరకు ఉతికి వాడుకోవచ్చని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
Read: యడ్యూరప్ప సంచలన వ్యాఖ్యలు: గెలవడానికి మోడీ వేవ్ ఒక్కటే సరిపోదు…