JN.1గా గుర్తించబడిన కొత్త కొవిడ్-19 వేరియంట్ భారత్‌లోని ఆరోగ్య సంరక్షణ నిపుణులు, అధికారులు, సాధారణ ప్రజలలో భయాందోళనను కలిగిస్తోంది. JN.1 కోవిడ్ సబ్‌వేరియంట్ మొదటగా లక్సెంబర్గ్‌లో గుర్తించబడింది. ఇది పిరోలా వేరియంట్ (BA.2.86) వారసుడిగా పరిగణించబడుతోంది. దీని మూలాలు ఒమిక్రాన్ సబ్-వేరియంట్‌లో ఉన్నాయి.
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి వ్యాప్తి, తీవ్రత తగ్గుముఖం పట్టినప్పటికీ తాజాగా పుట్టుకొస్తున్న కొత్త కరోనా వేరియంట్లు ఇంకా కలవరపెడతూనే ఉన్నాయి. తాజాగా అమెరికాలో కొవిడ్ కొత్త వేరియంట్‌ను గుర్తింంచారు. కొత్త వేరియంట్ బీఏ.2.86ను నిశితంగా పరిశీలిస్తున్నట్లు డబ్ల్యూహెచ్‌వో, యూఎస్ ఆరోగ్య అధికారులు తెలిపారు.
కొవిడ్ వేరియంట్ ఒమిక్రాన్ నివారణ కోసం ఒమిక్రాన్ ఎంఆర్‌ఎన్‌ఎ ఆధారిత బూస్టర్ వ్యాక్సిన్‌ను కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ శనివారం ప్రారంభించారు. జెమ్ కొవాక్ ఒమ్(GEMCOVAC-OM) అనేది భారత దేశానికి చెందిన మొట్టమొదటి ఎంఆర్‌ఎన్‌ఎ ఆధారిత వ్యాక్సిన్.
దేశవ్యాప్తంగా ఇటీవల కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, లక్షణాల విషయంలో కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని మేదాంత హాస్పిటల్ వైద్యులు, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చెస్ట్ సర్జరీ ఛైర్మన్ డాక్టర్ అరవింద్ కుమార్ సూచించారు.
ఇజ్రాయెల్ ఆరోగ్య మంత్రిత్వశాఖ కొత్త కొవిడ్-19 వేరియంట్‌ను కనుగొన్నట్లు నివేదించింది. ఇందులో ఒమిక్రాన్ వేరియంట్‌కు చెందిన రెండు ఉప-వేరియంట్‌లు ఉన్నాయి.
దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. నిన్నటితో పోలిస్తే.. బుధవారం నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు 6,422 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధరణ అయింది.
దేశ రాజధానిలో పెరుగుతున్న కోవిడ్ కేసుల నేపథ్యంలో ఢిల్లీలోని లోక్ నాయక్ జై ప్రకాష్ నారాయణ్ (ఎల్‌ఎన్‌జేపీ) ఆస్పత్రి కొవిడ్ వేరియంట్ మ్యుటేషన్‌పై అధ్యయనం నిర్వహించింది. దీనికి సంబంధించిన నివేదిక ఇంకా విడుదల కాలేదు.
కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ ఇలా విరుచుకుపడ్డ మహమ్మారి.. మళ్లీ ఫోర్త్ వేవ్ రూపంలో మళ్లీ పంజా విసురుతుందా.. అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.. భారత్‌లో దేశంలో మళ్లీ కరోనా కొత్త వేరియంట్ కేసులు బయటపడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఎక్స్‌ఈ వేరియంట్ కేసులు గుజరాత్, మహారాష్ట్రలో వెలుగు చూశాయి. మరోసారి కరోనా వ్యాప్తిపై ఆందోళన రేగడంతో కోవిడ్ వర్కింగ్ గ్రూప్ స్పందించింది. కొత్త వేరియంట్‌పై భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని వెల్లడించింది. తీవ్ర…