ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ టెన్షన్ కాస్త తగ్గిపోయింది… భారత్‌లోనూ అన్ని ఆంక్షలు ఎత్తివేసింది ప్రభుత్వం.. పాజిటివ్ కేసులు సంఖ్య తగ్గుతూ పోవడంతో.. కరోనా సమయంలో విధించిన రకరాల ఆంక్షలను క్రమంగా ఎత్తివేస్తూ వచ్చింది.. అయితే, భారత్‌లో కొత్తగా వెలుగు చూసిన కరోనా వేరియంట్ కలకలం సృష్టిస్తోంది.. ఒమిక్రాన్ రూపంలో భారత్‌లో థర్డ్ వేవ్ ప్రారంభమై మరోసారి కలవరపెట్టిన విషయం తెలిసిందే కాగా.. ఇప్పుడు ముంబైలో ఒమిక్రాన్ వేరియంట్ ఎక్స్ఈ తొలి కేసు నమోదైంది. దీంతో.. కేంద్ర ఆరోగ్య శాఖ…
తగ్గినట్టే తగ్గిన కరోనా మళ్లీ పంజా విసురుతోంది.. కొత్తగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసులు మరోసారి ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. ఇజ్రాయెల్‌లో మరో కొత్త వేరియంట్‌ను గుర్తించారు. బెన్ గురియోన్ ఎయిర్‌పోర్టుకు వచ్చిన ఇద్దరు ప్రయాణీకుల్లో కరోనా కొత్త వేరియంట్ బయటపడినట్లు ఇజ్రాయెల్ ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఒమిక్రాన్‌కు చెందిన రెండు సబ్ వేరియంట్‌లు BA.1, BA.2లను కొత్త వేరియంట్ కలిగి ఉన్నట్లు తెలిపింది. కొత్త వేరియంట్ సోకిన ఇద్దరు వ్యక్తులకు జ్వరం, తలనొప్పి, కండరాల బలహీనత వంటి…
సౌతాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ క్రమంగా అన్ని దేశాలను చుట్టేస్తోంది. ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికాను కూడా టెన్షన్ పెడుతోంది ఒమిక్రాన్.. యూఎస్‌లో శరవేగంగా ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికే దాదాపు 30 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ వేరియంట్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.. మరోవైపు.. కరోనా మహమ్మారి అగ్రరాజ్యాన్ని అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే కాగా.. ఇప్పటి వరకు నమోదైన కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 50 మిలియన్లు దాటింది… ఈ విషయాన్ని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ…
కరోనాతో ఇప్పటికే అల్లాడిపోయిన దేశ ప్రజలను డెల్టా ప్లస్ వేరియంట్.. మరింత భయపెడుతోంది. దేశంలో ఈ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ వేరియంట్ కారణంగానే మూడో వేవ్ ముంచుకొచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నానాటికీ ప్రమాదకరంగా మారుతోంది డెల్టా ప్లస్..! ఇప్పుడు ఏకంగా ప్రాణాలను బలి తీసుకుంటోంది. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీ ప్రాంతానికి చెందిన ఓ మహిళ కొవిడ్ సోకి మే 23న ప్రాణాలు కోల్పోయారు. ఆమె రక్తనమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ చేయగా.. ఆమెకు డెల్టా ప్లస్…