Covid Nasal Vaccine: కోవిడ్ మహమ్మారిపై పోరులో మరో ముందడుగు పడింది. ముక్కద్వారా వేసుకునే కోవిడ్ నాసల్ వ్యాక్సిన్ ను ప్రారంభించనున్నారు. స్వదేశీ వ్యాక్సిన్ తయారీ సంస్థ భారత్ బయోటెక్ తన ఇంట్రానాసల్ కోవిడ్-19 వ్యాక్సిన్ ఇన్ కోవాక్ ని భారతదేశంలో తొలిసారిగా జనవరి 26న విడుదల చేస్తున్నట్లు కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ ఎల్లా శనివారం వెల్లడించారు.
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారిపై విజయం సాధించడానికి ఇప్పుడున్న ఏకైక అవకాశం వ్యాక్సినేషన్.. అయితే, భారత్‌లో టీకా మాత్రమే మొదట అందుబాటులోకి వచ్చింది.. ఆ తర్వాత పౌడర్ రూపంలో కూడా మరో మందు మార్కెట్‌లోకి వచ్చింది.. ఇక, త్వరలోనే ముక్కు ద్వారా వ్యాక్సిన్ పొందవచ్చు.. ఎందుకంటే… కరోనా టీకా విషయంలో భారత్ బయోటెక్ సంస్థ మరో ముందడుగు వేసింది… ముక్కు ద్వారా వేసే కోవిడ్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌కు అనుమతి లభించింది.. భారత్ బయోటెక్ రూపొందించిన ముక్కు…