ప్రపంచవ్యాYS.Sharmila: కొడుకు ఫోటో షేర్ చేసిన షర్మిల.. అచ్చు అలాగే ఉన్నాడంటూ కామెంట్స్ప్తంగా అల్లకల్లోలం రేపిన కరోనా కేసులు మళ్ళీ భయపడుతున్నాయి. 2023 నాటికి కోవిడ్ తీవ్రత పెరుగుతుందని ఇప్పటికే అమెరికా హెచ్చరించింది. ఇతర దేశాల్లో కోవిడ్ కేస్ లు పెరుగుతున్న నేపథ్యంలో అలెర్ట్ అయింది కేంద్రం. అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం.. జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. జపాన్, యుఎస్ఎ, కొరియా, బ్రెజిల్ & చైనాలలో అకస్మాత్తుగా పెరుగుతున్న కేసుల దృష్ట్యా, ఇండియన్ SARS-CoV-2 జెనోమిక్స్ కన్సార్టియం (INSACOG) నెట్‌వర్క్ ద్వారా వేరియంట్‌లను ట్రాక్ చేయడానికి పాజిటివ్ కేసు నమూనాల మొత్తం జీనోమ్ సీక్వెన్సింగ్‌ను పంపించాలని కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశించింది.
Read Also:Andhra Pradesh: విజయవాడలో ప్రభుత్వం క్రిస్మస్ విందు.. హాజరైన సీఎం జగన్
రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు మ్యాప్ చేయబడిన INSACOG జీనోమ్ సీక్వెన్సింగ్ లాబొరేటరీస్ (IGSLలు)కి రోజువారీ ప్రాతిపదికన, సాధ్యమైనంతవరకు అన్ని పాజిటివ్ కేసుల నమూనాలను పంపాలని అన్ని రాష్ట్రాలను కోరింది కేంద్ర ఆరోగ్య శాఖ. చైనాలో ఆంక్షలు ఎత్తివేశాక అక్కడ కరోనా వీరవిహారం చేస్తోంది. మరణాలు కూడా ఆందోళనకరంగా మారాయి. ఇదిలా ఉంటే… కోవిడ్ నాసిక వాక్సిన్ ( Nasal Vaccine) పై రాజ్యసభలో ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ ప్రశ్నించారు. లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్.
సెప్టెంబర్ 05, 2022 న ముక్కు ద్వారా ఇచ్చే వాక్సిన్ సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అనుమతిని ఇచ్చింది. రెండు డోసులు 28 రోజుల వ్యవధి లో ఇవ్వడానికి ( 4 చుక్కలు, 0.25 మీ.లీ, ఒక్కో డోస్ లో 0.5 మీ.లీ) ఇచ్చే విధంగా అనుమతి మంజూరు చేశామన్నారు. వాక్సిన్ మైత్రి ప్రోగ్రాం కింద డిసెంబర్ 15 , 2022 వరకు219.98 కోట్ల డోసులు దేశ వ్యాప్తంగా వేసినట్టు సభకు తెలిపింది మంత్రిత్వశాఖ. 90 పైగా దేశాలకు కోవిడ్ వాక్సిన్ ను భారత దేశం సప్లై చేసిందని కేంద్రమంత్రి తెలిపారు.
Read Also:Harsimrat Badal: మా సీఎం తాగి రాష్ట్రాన్ని నడుపుతున్నారు.. అకాలీదళ్ ఎంపీ సంచలన ఆరోపణలు