దేశంలో కరోనా కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. కేసులు పెరుగుతుండటంతో ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూలు, అమలు చేస్తున్నారు. పాజిటివిటి రేటు పెరుగుతుండటంతో ఢిల్లీ, హర్యానా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో విద్యాసంస్థలను మూసివేశారు. సినిమా హాళ్లు బంద్ చేశారు. ఇక 50 శాతం సీటింగ్‌లో రెస్టారెంట్లు, మెట్రోలు నడుస్తున్నాయి. కార్యాలయాలు సైతం 50 శాతం మంది ఉద్యోగులతోనే నడుస్తున్నాయి. మిగతా రాష్ట్రాల కంటే ఢిల్లీలో వేగంగా కేసులు పెరుగుతుండటంతో కేజ్రీవాల్ సర్కార్ ఆంక్షలను కఠినం చేసేందుకు సిద్ధమయింది. పాజిటివిటి రేటు 0.5 శాతం దాటితే ఎల్లో అలర్ట్ ను ప్రకటించి నైట్ కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. అయితే, ఇప్పుడు ఢిల్లీలో పాజిటివిటీ రేటు 4.59 శాతానికి పెరిగింది.
Read: ‘బిగ్ బాస్ ఓటిటి’ తెలుగుకు ముహూర్తం ఫిక్స్
ఇదే ఇప్పుడు అందర్ని భయపెడుతున్నది. పాజిటివిటీ రేటు 5 శాతానికి చేరుకుంటే రెడ్ అలర్ట్ ను ప్రకటించాల్సి ఉంటుంది. రెడ్ అలర్ట్‌ను ప్రకటించడం అంటే పూర్తి స్థాయిలో కర్ఫ్యూను అమలు చేయాలి. వీకెండ్స్‌లో జనసంచారాన్ని పూర్తిగా నిషేధించాల్సి రావొచ్చు. వీక్ డేస్‌లో కొన్నింటికి మినహాయింపులు ఇచ్చే అవకాశం ఉంటుంది. నిత్యావసర వస్తువుల దుకాణాలు మినహా మిగతా షాపులు, మాల్స్‌ను బంధ్ చేయాల్ని ఉంటుంది. బార్లు, రెస్టారెంట్లను పూర్తిగా క్లోజ్ చేయవచ్చు. అయితే, హోటల్స్‌కు పర్మిషన్ ఇచ్చే అవకాశం లేకపోలేదు. అదీ పరిమిత సంఖ్యలో మాత్రమే అనుమతి ఇవ్వొచ్చు. ఢిల్లీలో ఇప్పటికే సినిమా హాల్స్, స్పా, యోగా సెంటర్స్‌ను మూసేశారు. జీఆర్ఎపీ నిబంధనల ప్రకారం ప్రభుత్వ కార్యాలయాలు కూడా మూసేయాల్సి ఉంటుంది. అత్యవసర కార్యాలయాలు మినహాయింపులు ఉండొచ్చు. అటు ప్రైవేట్ కార్యాలయాలకు కూడా ఇది వర్తిస్తుంది. ఎల్లో అలర్ట్ అమలులో ఉండటం వలన పెళ్లిళ్లు, అంత్యక్రియలకు 20 మందిని మాత్రమే అనుమతిస్తున్నారు. రెడ్ అలర్ట్ అమలులోకి వస్తే ఆ సంఖ్య 15 కి కుదించే అవకాశం ఉంటుంది.