దేశ రాజధాని ఢిల్లీపై కరోనా పంజా విసురుతోంది.. ఇప్పటికే పలు కఠిన ఆంక్షలు విధించింది ఢిల్లీలోని అరవింద్ కేజ్రీవాల్ సర్కార్.. అయినా.. రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని ప్రైవేట్ ఆఫీసులను మూసివేయాలని నిర్ణయించింది. ఎమర్జన్సీ సర్వీసులు మినహా మిగిలిన ఉద్యోగులు అందరూ ఇంటి నుంచే పనిచేయాలని ఆదేశించింది. మినహాయించిన కేటగిరీకి చెందిన ప్రైవేట్ కంపెనీలు మినహా అన్ని ఆఫీసులు మూసివేయాల్సిందేనని పేర్కొంది.. ఇప్పటి వరకు,…
ఢిల్లీలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ప్రతీ రోజూ ఢిల్లీలో రికార్డ్ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ఇటీవలే పార్లమెంట్‌లో 400 మంది సిబ్బందికి కరోనా సోకింది. పార్లమెంట్‌లో పనిచేస్తున్నా సిబ్బంది అందరికీ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. సుప్రీంకోర్టులో 150 మంది సిబ్బందికి కరోనా సోకింది. దీంతో అత్యున్నత న్యాయస్థానంలో పనిచేస్తున్న 3వేల మంది సిబ్బందికి కరోనా పరీక్షలు చేస్తున్నారు. సుప్రీంకోర్టులో దీనికోసం ప్రత్యేక కరోనా నిర్ధారణ పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. Read: మనిషి…
కరోనా మహమ్మారి ఎవ్వరినీ వదలడం లేదు.. ఇప్పటికే పలవురు సినీ ప్రముఖులు కరోనా బారిన పడగా.. తాజాగా, రాష్ట్ర మంత్రికి కరోనా పాజిటివ్‌గా తేలింది.. తెలంగాణ విద్యుత్‌శాఖ మంత్రి జగదీష్ రెడ్డికి తాజాగా కోవిడ్ పాజిటివ్‌గా తేలింది.. తనకు కరోనా లక్షణాలు స్వల్పంగా ఉన్నాయని.. పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది మంత్రి జగదీష్‌రెడ్డి వెల్లడించారు.. వైద్యుల సూలచన మేరకు ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నట్టు వెల్లడించారు.. అంతే కాదు, ఈ మధ్య తనను కలిసినవారంతా కరోనా…
దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. రోజువారీ కేసులు లక్ష దాటిపోతున్నాయి. తాజాగా దేశంలో 1,68,063 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో 277 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 8,21,446 యాక్టీవ్ కేసులు ఉన్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. దేశంలో ఇప్పటి వరకు 152 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్టు గణాంకాలు చెబుతున్నాయి. నిన్నటితో పోలిస్తే ఈరోజు 6.4 శాతం తక్కువగా కేసులు నమోదయ్యాయి. అనేక రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ తో…
కరోనా ఎంట్రీ తర్వాత అందరి లైఫ్ స్టైల్ మారిపోయింది.. ప్రజల జీవితాల్లో మాస్క్ తప్పనిసరి అయిపోయింది.. ఇంటిని నుంచి బయట అడుగు పెడితే మాస్క్ మూతికి ఉండాల్సిందే.. ఇదే సమయంలో ఎన్నో రకాల మాస్క్‌లు ఎంట్రీ ఇచ్చాయి.. కొన్ని కొన్ని గంటల పాటు ధరించి పారవేసేవి కొన్ని అయితే, మరికొన్ని ఒకరోజు.. ఇంకా కొన్ని రోజుల పాటు.. ఇలా వాడుతున్నారు.. ఇక, క్లాత్ మాస్క్‌లు.. రెగ్యులర్‌గా వాష్ చేస్తూ ధరించేవారు చాలా మందే. ఇక, కరోనా నుంచి…
కరోనా మహమ్మారి రోజు రోజుకు పెరిగిపోతున్నది. అనేక రకాల వేరియంట్లు భయాందోళనలు కలిగిస్తున్నాయి. దీని నుంచి రక్షణ పొందేందుకు ప్రస్తుతం కొన్ని రకాల టీకాలు అందుబాటులో ఉన్నాయి. అయితే, అన్ని రకాల వైరస్ వేరియంట్ల నుంచి రక్షణ పొందేందుకు ఒకటే టీకాను తీసుకొచ్చేందుకు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా శరీరంలో టి కణాల ఉత్పత్తి పెరిగిందని నిపుణులు చెబుతున్నారు. అయితే, టి కణాల ఉత్పత్తి పెంచడం అన్ని ఒమిక్రాన్ తో సహా అన్ని…
దేశంలో కరోనా మహమ్మారి ఎవరినీ వదిలిపెట్టడం లేదు. ముఖ్యంగా వరుసబెట్టి వీఐపీలందరూ కరోనా బారిన పడుతున్నారు. పలువురు రాజకీయ ప్రముఖులకు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అవుతోంది. తాజాగా బీహార్ సీఎం నితీష్ కుమార్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఆయన వైద్యుల సలహా మేరకు ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నారని బీహార్ సీఎంవో వెల్లడించింది. ప్రతి ఒక్కరూ జాగ్రత్త చర్యలు తీసుకోవాలంటూ సీఎం నితీష్ పిలుపునిచ్చారని తెలిపింది. గతవారం నితీష్ కుమార్ నివాసంలో 11 మందికి కరోనా…
దేశంలో కరోనా కేసుల సంఖ్య మరోసారి విపరీతంగా పెరుగుతోంది. కరోనా వల్ల సామాన్యులతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు, సినిమా సెలబ్రిటీలు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. తాజాగా కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా స్వయంగా వెల్లడించారు. ప్రస్తుతం తాను హోం క్వారంటైన్‌లో ఉన్నట్లు ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఇటీవల తనను కలుసుకున్న వారు జాగ్రత్తగా ఉండాలని, కరోనా టెస్టులు చేయించుకోవాలని రాజ్‌నాథ్…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి కేసులు క్రమక్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. నిన్న భారీగా పెరిగిన కరోనా కేసులు ఇవాళ కాస్త తగ్గుముఖం పట్టాయి. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం…ఏపీ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 984 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఆంధ్ర ప్రదేశ్‌లో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,82, 843 కి పెరిగింది. Read Also: ఏపీ థియేటర్లలో 50 శాతం ఆక్యూపెన్సీ…
హైదరాబాద్‌లోని అంతర్జాతీయ గాలిపటాలు, స్వీట్ ఫెస్టివల్‌ను ఈ ఏడాది రద్దు చేశారు. కోవిడ్-19 కేసుల సంఖ్య గణనీయంగా పెరగడంతో వరుసగా రెండో ఏడాది కూడా నగరంలో మూడు రోజుల అంతర్జాతీయ గాలిపటాలు స్వీట్ ఫెస్టివల్‌ను నిలిపి వేస్తున్నట్టు నిర్వాహకులు అధికారికంగా తెలిపారు. జనవరి 14 నుంచి 16 వరకు సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో ఈ ఈవెంట్ జరగాల్సి ఉంది. మత, రాజకీయ, సాంస్కృతిక సహా అన్ని రకాల ర్యాలీలు, బహిరంగ సభలు మరియు సామూహిక సభలపై నిషేధం…