ఇజ్రాయిల్, పాలస్తీనా దేశాల మధ్య నిత్యం ఘర్షణలు జరుగుతూనే ఉంటాయి. అందులో సందేహం అవసరం లేదు. పాలస్తీనా దేశానికి చెందిన గాజా, వెస్ట్‌బ్యాంక్‌లు ఇజ్రాయిల్ ఆథీనంలో ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే, ఇప్పటికే ఇజ్రాయిల్‌లో 80 శాతం మందికి వ్యాక్సినేషన్ ఇచ్చారు. కానీ, గాజా, వెస్ట్‌బ్యాంక్ లోని పాలస్తీనీయన్లకు ఇప్పటి వరకు వ్యాక్సిన్ అందలేదు. దీంతో ఈ రెండు ప్రాంతాల్లోని పాలస్తీనియన్లకు వ్యాక్సిన్ అందించాలని నిర్ణయించింది ఇజ్రాయిల్.
Read: మొత్తం అమ్మేసి, రాష్ట్రాన్ని ప్రయివేటీకరిస్తారా : విజయశాంతి ఫైర్..
ఇందులో భాగంగా పాలస్తీనియన్ అథారిటికీ మిలియన్ డోసులను పంపేందుకు నిర్ణయం తీసుకుంది ఇజ్రాయిల్. త్వరలోనే ఈ మిలియన్ డోసులను గాజా, వెస్ట్ బ్యాంక్‌లోని ప్రజలకు వేయబోతున్నారు. ఇజ్రాయిల్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తరువాత ఈ నిర్ణయం తీసుకొవడంతో గాజా, వెస్ట్‌బ్యాంక్ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.