కరోనాతో గత రెండేళ్లుగా శుభకార్యాలు వాయిదా పడ్డాయి. ప్రస్తుతం వైరస్ కాస్త తగ్గుముఖం పట్టడంతో ఈ నెలలో చాలా జంటలు వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నాయి. అలాగే అక్టోబర్, నవంబర్‌ల్లోనూ మంచి ముహూర్తాలున్నాయని అంటున్నారు పురోహితులు. ఈనెలలో అధికంగా పెళ్లిళ్లు ఉండడంతో అన్ని రంగాల వారికి చేతినిండా పని దొరుకుతుంది. ఫ్లవర్ డెకరేషన్, బాజా భజంత్రీలు, వంట మాస్టర్స్‌తో పాటు ఫొటో, వీడియోగ్రాఫర్స్, పురోహితులకు మంచి డిమాండ్ ఏర్పడింది. తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటికే కళ్యాణ మండపాలు, కన్వెన్షన్…
ఇండియాలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. తాజాగా ఇండియాలో 25,166 కేసులు నమోదవ్వగా, 437 మంది కరోనాతో మృతి చెందినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నది. దాదాపు 5 నెలల తరువాత 25 వేల కేసులు నమోదవ్వడం విశేషం. ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3.22 కోట్లకి చేరింది. తాజాగా కరోనా నుంచి 36,830 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. భారత్‌లో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 3.14 కోట్లకు చేరింది.…
తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ భారీగా పెరిగాయి.. గత బులెటిన్‌లో 300కు దిగువగా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఇవాళ మళ్లీ నాలుగు వందలకు పైగా కొత్త కేసులు వెలుగు చూశాయి.. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 405 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మరో ముగ్గురు కరోనా బాధితులు మృతిచెందారు.. ఇదే సమయంలో 577 మంది కోవిడ్ బాధితులు పూర్థిస్థాయిలో కోలుకున్నారు. దీంతో.. పాజిటివ్ కేసుల…
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు భారీగా తగ్గాయి… ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 46,962 శాంపిల్స్ పరీక్షించగా.. 909 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.. మరో 13 మంది కరోనా బాధితులు ప్రాణాలు వదిలారు. ఇక, గత 24 గంటల్లో 1,543 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారని.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 2,57,08,411కు చేరిందని బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. తాజా…
దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఈరోజు నుంచి స్కూళ్లు తిరిగి ప్రారంభం అయ్యాయి. అనేక విశ్వ విద్యాలయాల పరీక్షలు కూడా ప్రారంభం అయ్యాయి. చాలా కాలం తరువాత తిరిగి ప్రభుత్వ పాఠశాలలు తెరుచుకోవడంతో సందడి వాతావరణం నెలకొన్నది. థర్డ్ వేవ్ ముప్పు ఉందనే వార్తలు వస్తున్నప్పటికీ, తల్లిదండ్రులు పిల్లలు బడికి పంపుతుండటంతో ప్రభుత్వాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. ఇక, టీచర్లకు ఇప్పటికే వ్యాక్సిన్‌ను అందించారు. మిగిలిన కొంతమందికి కూడా వేగంగా వ్యాక్సిన్ అందించేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఇక…
ఇండియాలో కరోనా మహమ్మారి కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. తాజాగా ఇండియాలో 32,937 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 417 మరణాలు సంభవించాయి. 24 గంటల్లో 35,909 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు భారత్‌లో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 3,14,11,924కి చేరగా, 3,81,947 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక భారత్‌లో కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,31,642కి చేరింది. కరోనా నుంచి బయటపడాలి అంటే వ్యాక్సిన్ తీసుకోవడం ఒక్కటే…
కరోనా కారణంగా ఏడాదిన్నరగా విద్యా సంస్థలు మూతపడ్డాయి. ఆ మధ్యలో తెరుచుకున్నా వైరస్ మళ్లీ విజృంభించడంతో మరొసారి విద్యా సంస్థలను మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో పాఠశాలలు తెరిచేందుకు ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయి. ఇవాళ్టి నుంచి ఏపీలో స్కూళ్లు పునప్రారంభం కానున్నాయి. ప్రత్యక్ష తరగతులు జరగనున్నాయి.కరోనా కష్టాలు, సవాళ్లు అన్నింటినీ అధిగమించి.. పాఠశాలల ప్రారంభానికి రెడీ అయింది ప్రభుత్వం. థర్డ్ వేవ్ హెచ్చరికలతో ప్రత్యేక ఏర్పాట్లు చేసిన విద్యాశాఖ అధికారులు.. తరగతుల నిర్వహణపై…
తెలంగాణ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మూడు వందల దిగువగా చేరాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 245 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. ఒక్కరు కన్నుమూశారు.. ఇదే సమయంలో 582 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది ప్రభుత్వం. దీంతో.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6,52,380 కు చేరుకోగా… కోలుకున్నవారి సంఖ్య 6,41,270 కు పెరిగింది……
ఏపీలో రేపట్నుంచి స్కూళ్లు ప్రారంభం కానున్నాయి. కరోనా సెకండ్ వేవ్ కారణంగా మూతబడిన స్కూళ్లు.. మళ్లీ తెరుచుకోనున్నాయి. దీనికోసం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. అయితే, పిల్లల్ని స్కూళ్లకు పంపేందుకు తల్లిదండ్రులు మాత్రం భయపడుతున్నారు. దీంతో, గుంటూరు జిల్లాలో స్కూల్స్ ఓపెనింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పూర్తి కరోనా నిబంధలు పాటిస్తామని చెబుతున్నారు. అయితే కరోనా థర్డ్‌వేవ్ ముప్పు పొంచి ఉన్నవేళ.. స్కూల్స్ తెరవకపోవడమే బెటరంటున్నారు విద్యార్థుల తల్లితండ్రులు. Read Also : “భీమ్లా నాయక్”…