కరోనా కాలంలో ఎవరు ఏం చెప్పినా దానిని ఫాలో అవుతుంటారు. గత కొన్నిరోజులుగా కొన్ని రకాల చిట్కాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వేడినీళ్ళతో కరోనాకు చెక్ పెట్టొచ్చని వార్తలు వస్తున్నాయి. వేడి నీళ్లను తాగడం వలన, స్నానం చేయడం వలన కరోనా తగ్గిపోదని, 70 నుంచి 80 డిగ్రీల ఉష్ణోగ్రతలో మాత్రమే ఈ వైరస్ చనిప�
భారత్ నుంచి ఎక్కువ మంది పర్యటనల కోసం మాల్దీవులకు వెళ్తుంటారు. అలా మాల్థీవులకు వెళ్లే భారత పర్యాటకులపై ఆ దేశం తాత్కాలికంగా నిషేదం విధించింది. భారత్‌లో కరోనా వ్యాప్తి అధికంగా ఉండటంతో ఆ దేశం ఈ నిర్ణయం తీసుకుంది. భారత్‌తో పాటు దక్షిణాసియా దేశాల్లో పర్యటించిన పర్యాటకులపై క�
ఈరోజు నుంచి తెలంగాణలో లాక్ డౌన్ అమలు జరుగుతున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ అమలు జరుగుతుండటంతో ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 10 గంటల వరకు ప్రయాణానికి అనుమతి ఉన్నది. ఉదయం 10 గంటల తర్వాత ఎవరిని బయటకు అనుమతించడం లేదు. బస్టాండ్లు బోసిపోయి దర్శనం ఇస్తున్నాయి. చాలా మందికి లాక్డౌన్క�
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రేపటి నుంచి పదిరోజులపాటు రాష్ట్రంలో లాక్ డౌన్ అమలు చేయబోతున్నారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు నిత్యవసర వస్తువులు, మెడిసిన్ ఇతర వస్తువులు కొనుగోలు చేయడానికి అనుమతులు ఇచ్చారు. ఉదయం 10 గంటల తరువాత ఎవరూ బయటకు రాకూడదు. లాక్‌డౌన�
ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం కాబోతున్నది. తెలంగాణ కేబినెట్ లో కీలక విషయాల గురించి చర్చించబోతున్నారు. నైట్ కర్ఫ్యూ సమయంలో జరిగిన పరిణామాలు, కరోనా వైరస్ వ్యాప్తి, లాక్ డౌన్ విధిస్తే వచ్చే నష్టాలు, ఇబ్బందులు తదితర విషయాల గురించి ఈ కేబినెట్ మీటింగ్ లో చర్చించబ�
దేశంలో కరోనా మహమ్మారి రోజు రోజుకు ఉదృతం అవుతున్న సంగతి తెలిసిందే. భారత్ ను ఆదుకోవడానికి పలు దేశాలు ముందుకు వచ్చాయి. అంతర్జాతీయ సంస్థలు. బహుళ జాతీయ కంపెనీలు ముందుకు తమవంతు సహాయం ప్రకటిస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రముఖ సోషల్ మీడియా ట్విట్టర్ 110 కోట్ల రూపాయల సహాయాన్ని ప్రకటించింది. ఈ మొత్తాన్ని భ
రాష్ట్రంలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో కేసులు తక్కువగా నమోదవుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటె,ప్రస్తుత కరోనా పరిస్థితులపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగుతున్నది. తెలంగాణలో కరోనా పరీక్షలు తక్కువగా చేస్
దేశంలో కరోనా కేసులు పెరిగిపోతుండటంతో వ్యాక్సిన్ ను వేగవంతం చేశారు. ప్రస్తుతం దేశంలో మూడు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. కోవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్లు ఇండియాలో తయారవుతుండగా, స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. హైదరాబాద్ కు చెందిన భారత్ బయ
ఇండియాలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. అయితే, నిన్నటి కంటే స్వల్పంగా కేసులు తగ్గాయి. తాజాగా దేశంలో 3,29,942 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,29,92,517కి చేరింది. ఇందులో 1,90,27,304 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 37,15,221 కేసులు యాక్టివ్ గా ఉ�
కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో వైరస్ గాలిలో ఎంత దూరం వరకు వ్యాపించి ఉంటుంది. ఎంత తీవ్రత ఉంటుంది అనే అంశాలపై అనేక మంది అనేక సమాధానాలు ఇచ్చారు. అయితే, అమెరికాకు చెందిన అంటువ్యాధుల నియంత్రణ సంస్థ మరోసారి దీనికి సమాధానం తెలిపింది. కరోనా రోగి నుంచి వైరస్ మూడు నుంచి ఆరు అడుగుల దూర