Vivo T4 Ultra: వివో మరోసారి టెక్ ప్రియులను ఆకట్టుకునేలా తన కొత్త స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేయడానికి సిద్ధమైంది. గత ఏడాది వచ్చిన T3 Ultraకి అప్డేటెడ్ గా త్వరలో Vivo T4 Ultra భారత మార్కెట్లోకి రానుంది. తాజాగా ఈ ఫోన్‌కు సంబంధించిన టీజర్లు మొదలయ్యాయి. వీటిలో ఫ్లాగ్‌షిప్-లెవల్ జూమ్ ఫీచర్‌ను కంపెనీ హైలైట్ చేస్తోంది. వివో విడుదల చేసిన టీజర్ ప్రకారం Vivo T4 Ultra ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్‌తో వస్తోంది. ఇందులో ముఖ్యంగా పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉండబోతోంది. ఇది 100x డిజిటల్ జూమ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అలాగే, రింగ్ ఆకారంలో ఉండే LED ఫ్లాష్ కూడా టీజర్‌లో కనిపిస్తోంది.
Read Also: What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
T3 Ultra మోడల్‌లో Dimensity 9200+ ప్రాసెసర్ ఉన్నా, కెమెరా పరంగా అంతగా ఆకట్టుకోలేకపోయింది. అది కేవలం 50MP మెయిన్ కెమెరా, 8MP అల్ట్రా వైడ్ కెమెరాతో మాత్రమే వచ్చిన సంగతి తెలిసిందే. కానీ T4 Ultra లో కెమెరా విభాగాన్ని గణనీయంగా మెరుగుపరిచారు. వీటితోపాటు ఇందులో 6.67-ఇంచుల pOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్‌రేట్‌తో డిస్ప్లే ఉండనున్నట్లు సమాచారం. ఇందులో MediaTek Dimensity 9300 సిరీస్ ప్రాసెసర్ వాడనున్నారు.
Read Also: Viral Video: అంత ఆగలేకపోతున్నారా ఏంటి.. పబ్లిక్‌గా రొమాన్స్‌లో మునిగితేలిన యువత..!
అలాగే 50MP Sony IMX921 ప్రైమరీ కెమెరా, 50MP పెరిస్కోప్ జూమ్ కెమెరా, 90W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉండనున్నాయి. అలాగే సెల్ఫీ కెమెరా, బ్యాటరీ సామర్థ్యం వంటి వివరాలు త్వరలో వెలువడనున్నాయి. ఈ ఫోన్ జూన్ మొదటి వారంలో భారతదేశంలో విడుదల కానుందని సమాచారం. విడుదలైన తర్వాత ఫ్లిప్ కార్ట్, వివో ఇండియా ఆన్‌లైన్ స్టోర్, ఆఫ్ లైన్ స్టోర్‌లలో ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది. వివో తన T సిరీస్‌ను కెమెరా, పెర్ఫార్మెన్స్ పరంగా అప్‌గ్రేడ్ చేస్తూ తీసుకురావడం వినియోగదారులకు కొత్త అనుభూతినిస్తుంది. T4 Ultra ఫోన్ ఫ్లాగ్‌షిప్ ఫీచర్లతో మిడ్‌రేంజ్ మార్కెట్‌ను గెలవగలదా అనేది వేచి చూడాలి.