దేశంలో కరోనా కేసులు పెరిగిపోతుండటంతో వ్యాక్సిన్ ను వేగవంతం చేశారు. ప్రస్తుతం దేశంలో మూడు వ్యాక్సిన్‌లు అందుబాటులోకి వచ్చాయి. కోవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్‌లు ఇండియాలో తయారవుతుండగా, స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ కోవాగ్జిన్ ను తయారు చేసింది. ఈ వ్యాక్సిన్ ను ఇప్పుడు రాష్ట్రాలకు నేరుగా సరఫరా చేసేందుకు భారత్ బయోటెక్ సిద్దం అయింది. మే 1 వ తేదీ నుంచి దేశంలోని 14 రాష్ట్రాలకు వ్యాక్సిన్ ను నేరుగా అందిస్తున్నట్టు భారత్ బయోటెక్ సంస్థ ఎండి పేర్కోన్నారు. ప్రస్తుతం ఏపీ, తెలంగాణ, ఒడిశా, అసోం, చత్తీస్‌గడ్, గుజరాత్, జమ్ముకాశ్మీర్, ఝార్ఖండ్, మద్యప్రదేశ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నట్టు భారత్ బయోటెక్ ఎండి పేర్కోన్నారు.