కరోనా మహమ్మారి విజృంభణతో విదేశీ ప్రయాణాలు పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి… కోవిడ్ కేసులు అదుపులోకి వస్తున్న తరుణంలో.. కొన్ని దేశాలు.. ఆంక్షలను సడలిస్తూ వస్తున్నాయి… విమానాల రాకపోకలపై నిషేధాన్ని ఎత్తివేస్తున్నాయి.. కానీ, భారతీయ విమానాలపై ఆంక్షలను మరోసారి పొడిగించింది కెనడా ప్రభుత్వం… సెప్టెంబర్ 21 తేదీ వరకు భారత్ విమానాలపై నిషేధాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.. కాగా, డెల్టా వేరియంట్ వెలుగు చూడడంతో ఏప్రిల్ 22న ఇండియా నుంచి నేరుగా వెళ్లే విమానాలపై కెనడా నిషేధం విధించింది..…
తెలంగాణ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఐదు వందల దిగువకు చేరిన తర్వాత స్థిరంగా కొనసాగుతోంది.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 453 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో ముగ్గురు కరోనా బాధితులు కన్నుమూశారు.. ఇదే సమయంలో 614 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది ప్రభుత్వం. దీంతో.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6,49,859కు చేరుకోగా……
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గింది… ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. రాష్ట్రం లో గత 24 గంటల్లో నిన్న ఉదయం 9 గంటల నుంచి ఇవాళ ఉదయం 9 గంటల వరకు 54,455 శాంపిల్స్ పరీక్షించగా.. 1,413 మందికి పాజిటివ్‌గా తేలింది.. మరో 18 మంది కరోనా బాధితులు ప్రాణాలు వదిలారు.. చిత్తూరులో ఐదుగురు, కృష్ణా జిల్లాలో ముగ్గురు, తూర్పు గోదావరి, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో…
ఇండియాలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నా తీవ్రత ఏమాత్రం తగ్గలేదు. కరోనా తీవ్రత కారణంగా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. దేశంలో కొత్తగా 35,499 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,19,69,954కి చేరింది. ఇందులో 3,11,39,457 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 4,02,188 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 447 మంది మృతి చెందినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ…
కరోనా దెబ్బకు వర్కింగ్ స్టైల్ మొత్తం మారిపోయింది… చిన్న సంస్థల నుంచి బడా కంపెనీలు వరకు ప్రపంచవ్యాప్తంగా వర్క్‌ఫ్రం హోం బాట పట్టాయి… పరిస్థితులు కొంత అదుపులోకి వచ్చిన తర్వాత మళ్లీ ఉద్యోగులను ఆఫీసుకు రప్పిస్తున్నారు.. మరికొన్ని బడా సంస్థలు సైతం.. ఉద్యోగులకు వర్క్‌ఫ్రం హోం అమలు చేస్తూనే ఉంది.. ఈ నేపథ్యంలో ఇంటి నుంచే పని విధానంపై కీలక నిర్ణయం తీసుకుంది గూగుల్.. సెప్టెంబరు నుంచి ఆఫీసుకు రావాలంటూ తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులను కోరింది.…
ఏపీలో కరోనా కేసులు పెరుగుతూ… తగ్గుతున్నాయి. తాజాగా ఏపీ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో ఏపీలో కొత్తగా 2,050 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 19,82,308 కు చేరింది. ఇందులో 19,48,828 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా 19,949 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనా కారణంగా 18 మంది…
తెలంగాణలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి… రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం… గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసులు కాస్త పెరిగాయి.. 1,05,201 శాంపిల్స్ పరీక్షించగా… 569 మందికి పాజిటివ్‌గా తేలింది… మరో నలుగురు కోవిడ్ బాధితులు మృతిచెందారు.. ఇదే సమయంలో 657 మంది కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,48,957 కు చేరగా… కోలుకున్నవారి సంఖ్య 6,36,552 కి పెరిగింది.. ఇక,…
ఏపీలో కరోనా కేసులు సంఖ్య రోజు రోజుకు తగ్గుతూ వస్తోంది. తాజాగా ఏపీ వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 80,376 సాంపిల్స్ పరీక్షించగా.. 1,908 మందికి పాజిటివ్‌గా తేలింది.. మరో 23 మంది కోవిడ్ బాధితులు మృతిచెందారు. ఇక, ఇదే సమయంలో 2,103 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,80,258 కి పెరగగా.. కోలుకున్నవారి సంఖ్య 19,46,370 కి చేరింది..…
దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్రలో రోజువారీ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. దీంతో పొరుగునున్న రాష్ట్రాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. కర్ణాటక రాష్ట్రం కరోనాను కట్టడి చేసే క్రమంలో ఆంక్షలు విధించేందుకు సిద్ధమయింది. రాత్రిసమయంలో కర్ఫ్యూ విధించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలుచేయాలని నిర్ణయం తీసుకున్నారు. అత్యవసర్ విభాగాలకు నైట్ కర్ఫ్యూ నుంచి సడలింపులు ఇచ్చారు. నిబంధనలు ఉల్లంఘిస్తే…
2019 డిసెంబర్ నుంచి ప్రపంచం కరోనా మహమ్మారి కోరల్లో చిక్కుకొని ఇబ్బందులు ఎదుర్కొంటోంది. వేగంగా కేసులు పెరుగుతుండటంతో ప్రపంచం మొత్తం ఆందోళన చెందుతోంది. కొన్ని దేశాల్లో కేసులు తగ్గినట్టే తగ్గి మరలా విజృంభిస్తున్నాయి. అమెరికాలో వ్యాక్సిన్ వేగంగా అమలుచేస్తూనే కేసులను కట్డడి చేశారు. కాని, మరలా కేసులు పెరుగుతున్నాయి. అక్క అమెరికాలోనే ఏకంగా రోజువారి కేసులు లక్షకు పైగా నమోదవుతున్నాయి. ఇలానే ఇన్ఫెక్షన్లు పెరిగితే దాని వలన తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని, కరోనా వేరియంట్ల కారణంగా…