తెలంగాణలో కరోనా కొత్త కేసుల సంఖ్య మరింత కిందకు దిగివచ్చింది.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 58,261 శాంపిల్స్ పరీక్షించగా.. 259 మందికి పాజిటివ్‌గా తేలింది.. ఇవాళ మరో వ్యక్తి కోవిడ్‌బారినపడి మృతిచెందగా.. 301 మంది కరోనాబాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,62,785కు చేరగా.. రికవరీ కేసులు 6,53,603కి పెరిగాయి. ఇక, ఇప్పటి వరకు కోవిడ్‌తో 3,900 మంది ప్రాణాలు…
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూ, తగ్గుతూ ఉన్నాయి. అయితే రాష్ట్రవైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 61,178 శాంపిల్స్ పరీక్షించగా… 1,367 మందికి పాజిటివ్‌గా తేలింది… మరో 14 మంది కరోనా బాధితులు కన్నుమూశారు.. ఇదే సమయంలో 1,248 మంది కోవిడ్ బాధితులు కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. ఇక, తాజా కేసులతో కలుపుకొని.. రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,34,786 కు చేరగా.. 20,06,034 మంది…
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య స్థిరంగా కొనసాగుతోంది.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 73,323 శాంపిల్స్ పరీక్షించగా.. 324 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.. మహమ్మారిబారినపడి మరొకరు మృతిచెందారు.. ఇక, ఇదే సమయంలో.. 280 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,62,526కు చేరగా.. రికవరీ కేసుల సంఖ్య 6,53,302కు పెరిగింది.. కోవిడ్‌తో మరణించినవారి సంఖ్య 3,899కు చేరిందని.. ప్రస్తుతం రాష్ట్రంలో…
ఇండియాలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా కేంద్రం కరోనా బులిటెన్‌ను రిలీజ్ చేసింది. ఈ బులిటెన్ ప్రకారం దేశంలో కొత్తగా 27,176 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 3,33,16,755కి చేరింది. ఇందులో 3,25,22,171 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 3,51,087 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇకపోతే, గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 284 మంది మృతి చెందారు. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన కరోనా…
కరోనా కాలంలో కొత్త కొత్త విషయాలను మనం తెలుసుకున్నాం. రెండేళ్లుగా చాలా మంది ఇంటికే పరిమితమయ్యి ఉద్యోగాలు చేస్తున్నాయి. పిల్లలైతే ఇంటి నుంచే ఆన్‌లైన్ ద్వారా పాఠాలు చదువుతున్నారు. కరోనా సమయంలో చాలా మంది ఖైదీలను ప్రభుత్వాలు విడుదల చేశాయి. అలా విడుదలైన ఖైదీలు మళ్లీ నేరాలకు పాల్పడకుండా ఉంటారు అని గ్యారెంటీ లేదు. అందుకే కువైట్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. వర్క్‌ఫ్రమ్ హోమ్ మాదిరిగానే జైల్ ఫ్రమ్ హోమ్ అనే అంశాన్ని ప్రవేశపెట్టింది. దీనికి…
హెల్త్‌హబ్స్ ద్వారా ఏర్పాటయ్యే ఆస్పత్రుల్లో కనీసం యాభైశాతం బెడ్లను ఆరోగ్యశ్రీ పేషెంట్లకు ఇవ్వాలని స్పష్టం చేశారు ఏపీ సీఎం వైఎస్ జగన్.. వైద్య ఆరోగ్యశాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం వైఎస్ జగన్.. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులు, వ్యాక్సినేషన్, హెల్త్ హబ్స్, ఆస్పత్రుల నిర్వహణ, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌లపై సమీక్ష చేశారు.. జిల్లా కేంద్రాలు, కార్పొరేషన్లలో హెల్త్‌హబ్స్‌పై ఆరా తీశారు.. ఈ సమావేశంలో హెల్త్ హబ్స్ ఏర్పాటు విధివిధానాలపై సీఎంకు వివరాలు అందించారు అధికారులు. ఏయే జిల్లాల్లో ఏ…
కరోనా కారణంగా గత ఏప్రిల్ లో ప్రారంభమైన ఐపీఎల్ 2021 వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే భారత్ లో ఇప్పటికి కరోనా కేసులు తగ్గకపోవడంతో ఈ సీజన్ లో మిగిలినమచ్ లను ఈ నెల 19 నుండి యూఏఈ వేదికగా నిర్వహించేందుకు బీసీసీఐ నిర్ణయించుకుంది. ఇక ప్రస్తుతం అన్ని ఐపీఎల్ జట్లు కూడా యూఏఈ చేరుకున్నాయి. అయితే విరాట్ కోహ్లీ కెప్టెన్ గా వ్యవరిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ ఓ నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ 2021…
ఒకప్పుడు క్రీస్తు పూర్వం.. క్రీస్తు శకం అని మాట్లాడుకునే వాళ్లు. కానీ కరోనా ఎంట్రీతో ఆ రోజులు పోయినట్లే కన్పిస్తున్నాయి. ఇప్పుడంతా కరోనా ముందు(Before Carona).. కరోనా తర్వాత(After Carona) అని మాట్లాడుకుంటున్నారు. కరోనా ఇప్పట్లో మనల్నీ వదిలిపోయేలా లేదు. ఫస్ట్ వేవ్.. సెకండ్ వేవ్.. థర్డ్ వేవ్ అంటూ మనల్ని భయపడుతూనే ఉంది. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ తనకు దూరంగా ఉంటే మిమల్ని, మన కుటుంబాలను ఏం చేయనంటూ కరోనా అభయమిస్తుంది. ఇదొక్కటే మానవళిని కరోనా…
తెలంగాణలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 70,974 శాంపిల్స్ పరీక్షించగా 315 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మరో ఇద్దరు కరోనా బాధితులు మృతిచెందారు. ఇక, ఒకేరోజు 318 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.. దీంతో.. ఇప్పటి వరకు రాష్ట్రంలో చేసిన టెస్ట్‌ల సంఖ్య 2,55,03,276కు చేరగా.. పాజిటివ్ కేసులు 6,61,866కు పెరిగాయి..…
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గింది.. దీనికి ప్రధానం కారణం టెస్ట్‌ల సంఖ్య కూడా తగ్గించడంగా చెప్పుకోవచ్చు.. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 38,746 శాంపిల్స్ పరీక్షించగా.. 864 కోవిడ్ పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి.. మరో 12 మంది కోవిడ్ బాధితులు మృతిచెందారు.. చిత్తూరులో నలుగురు, నెల్లూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరు చొప్పున, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరిలో ఒక్కొక్కరు మరణించారు.…