ఏపీలో కరోనా ఉధృతి ఏమాత్రం తగ్గడంలేదు. తాజాగా ఏపీలో 24 గంటల్లో 1557 కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,12,123కి చేరింది. ఇందులో 19,83,119 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 15,179 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో 18 మంది మృతిచెందినట్టు ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నది. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 13,825కి…
దేశంలో మరోసారి కేసులు భారీగా నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 46 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఒక్కసారిగా 11 వేలకు పైగా కేసులు పెరగడంతో కేంద్రం అప్రమత్తం అయింది. నమోదైన 46,164 కేసుల్లో ఒక్క కేరళ రాష్ట్రంలోనే 31,445 కేసులు నమోదయ్యాయి. ప్రతిరోజూ కేరళలో పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతుండటంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. పెద్ద సంఖ్యలో వ్యాక్సినేషన్ జరుగుతున్నప్పటికీ కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. డెల్టా వేరియంట్ వ్యాప్తి అధికంగా ఉండటంతో పాజిటివ్…
కరోనా మహమ్మారి తగ్గినట్టే తగ్గి మరలా విజృంభిస్తోంది. కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే రోజువారి కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. కొన్ని నెలల క్రితం దేశంలో జీరో కేసులు నమోదవుతున్నాయని న్యూజిలాండ్ దేశం సంబరాలు చేసుకున్నది. వేల మందితో కలిసి మ్యూజిక్ కన్సర్ట్‌ను నిర్వహించారు. అయితే, అది కొంతకాలమే అని మరోమారు తేలిపోయింది. చాలా కాలం తరువాత రాజధాని ఆక్లాండ్‌లో కరోనా కేసు నమోదవ్వడంతో ఆ నగరంలో లాక్‌డౌన్‌ను విధించారు. లాక్‌డౌన్ విధించినప్పటికీ ఆ నగరంలో కేసులు…
ఇండియాలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. తాజాగా ఇండియాలో 25,166 కేసులు నమోదవ్వగా, 437 మంది కరోనాతో మృతి చెందినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నది. దాదాపు 5 నెలల తరువాత 25 వేల కేసులు నమోదవ్వడం విశేషం. ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3.22 కోట్లకి చేరింది. తాజాగా కరోనా నుంచి 36,830 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. భారత్‌లో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 3.14 కోట్లకు చేరింది.…
ఇండియాలో కరోనా కేసులు మళ్లీ విజృంభిస్తున్నాయి. తాజాగా ఇండియాలో 40,120 కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నది. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,21,17,826కి చేరింది. ఇందులో 3,13,02,345 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 3,85,227 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక, గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 585 మంది మృతి చెందారు. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు 4,30,254 మంది కరోనాతో మృతి చెందినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ…
తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. రోజువారీ కేసుల సంఖ్య భారీగా తగ్గడంతో సాధారణ జీవనం ప్రారంభం అయింది. ఇక ఇదిలా ఉంటే, రాష్ట్రంలో కొత్తగా 453 కరోనా కేసులు నమోదైనట్టు తెలంగాణ ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,51,288కి చేరింది. ఇందులో 6,39,456 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 8,137 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో తెలంగాణలో కరోనాతో ముగ్గురు…
కరోనా మహమ్మారిపై ప్రపంచం పోరాటం చేస్తున్నది. కరోనా నుంచి ఇప్పటి వరకూ ఏ దేశం కూడా పూర్తిగా కోలుకోలేదు. తగ్గినట్టే తగ్గి కేసులు మరలా పెరుగుతున్నాయి. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని దేశాల్లో టీకాలు వేగంగా అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, ఇప్పటి వరకు కొన్ని రకాల టీకాలు మాత్రమే అందుబాటులో ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆర్ధికంగా అభివృద్ధి చెందిన దేశాలు ముందుగానే కోట్లాది డోసులు సమకూర్చుకున్నాయి. మధ్య, పేద దేశాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇండియాలో…
ప్రపంచంలో కరోనా కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. తగ్గిందిలే అనుకుంటున్న సమయంలో తిరిగి కరోనా విజృంభిస్తుండటంతో అన్నిదేశాలు బెంబెలెత్తిపోతున్నాయి. సోమవారం రోజున యూఎస్‌లో ఏకంగా లక్షకు పైగా కేసులు నమోదయ్యాయి. వ్యాక్సిన్ వేగంగా అమలు చేస్తున్నప్పటికీ కేసులు పెరుగుతుండటం భయాందోళనలు కలిగిస్తోంది. అమెరికాలోని ఆర్కాన్సన్ రాష్ట్రంలో అత్యధిక కేసులు, ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య పెరుగుతున్నది. సోమవారం రోజున ఆ రాష్ట్రంలో 1376 మంది ఆసుపత్రుల్లో చేరారు. ఇక అమెరికా తరువాత అత్యధిక కేసులు ఇరాన్‌లో నమోదవుతున్నాయి. సడలింపులు…
తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో 494 కరోనా కేసులు నమోదైనట్టు తెలంగాణ ఆరోగ్యశాఖ పేర్కొన్నది. రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,50,353కి చేరింది. ఇందులో 6,38,410 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా.. 8,112 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కరోనాతో ముగ్గురు మృతిచెందినట్టు హెల్త్ బులిటెన్‌లో పేర్కొన్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన కరోనా మరణాల సంఖ్య 3,831కి చేరింది. ఇక ఇదిలా…