దేశంలో కొవిడ్ కేసులు భారీగా పెరిగాయి. శుక్రవారం 3,44,994 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా.. 8,329 మంది వైరస్ బారిన పడ్డారు. 10 మంది కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం కొవిడ్ నుంచి 4,216 మంది కోలుకున్నారు. ప్రస్తుతం మహారాష్ట్ర, కేరళ, దిల్లీ, కర్ణాటక, హర్యానాలో మహమ్మారి విజృంభిస్తోంది. దీంతో క్రియాశీల కేసులు 40 వేల మార్కును దాటేశాయి. దేశంలో రికవరీ రేటు 98.69 శాతానికి పడిపోయింది. పాజిటివిటీ రేటు వరుసగా మూడోరోజు రెండు శాతం(2.41…
భారత్‌లో కరోనా మరోసారి విజృంభిస్తోంది. గతకొన్ని రోజులుగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు 7,240 మంది వైరస్ బారినపడ్డట్లు తేలింది. ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,24,723కి చేరింది. బుధవారం 3,591 మంది కోలుకున్నారు.. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.71 శాతానికి చేరింది. మృతుల సంఖ్య 1.21 శాతంగా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 0.08 శాతం వద్ద…
కరోనా వైరస్‌తోనే కొట్టుమిట్టాడుతున్న ప్రజలపై మంకీపాక్స్ రూపంలో మరో వైరస్ విరుచుకుపడుతోంది. అయితే.. ఈ వైరస్ చిన్నారులను టార్గెట్ చేస్తుండటం ఆందోళన కలిగించే విషయం. రోజు రోజుకు మంకీ పాక్స్ కేసులు దేశాలకు వ్యాప్తి చెందుతోంది. ఇప్పటి వరకు ఈ వైరస్ 27 దేశాలకు విస్తరించింది. 27 దేశాల్లో మొత్తం 780 మంకీపాక్స్ కేసులు నమోదయినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రకటించింది. మే 13వ తేదీ నాటికి ప్రపంచ వ్యాప్తంగా 257 కేసులు బయటపడగా… ఈ…
2020లో ప్రారంభమైన కరోనా వైరస్ వ్యాప్తి ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే కరోనా లాక్‌డౌన్ తర్వాత విజయవాడలో రోడ్డుప్రమాదాలు పెరిగాయని ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. ఈ సందర్భంగా నగర వ్యాప్తంగా 28 బ్లాక్ స్పాట్స్‌ను ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. దుర్గగుడి ఫ్లై ఓవర్‌పై ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్న 18 మందిపై కేసులు నమోదు చేశారు.గొల్లపూడి నుండి ఇబ్రహీంపట్నం వెళ్లే హైవేపై నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. Internet problems: వాటమ్మా…వాట్ ఈజ్ దిస్ అమ్మా ఈ ఏడాది…
కరోనా మహమ్మారి నుంచి ప్రపంచదేశాలు ఇప్పుడిప్పుడే కాస్త ఊపిరి పీల్చుకుంటున్నాయి. అలాగని ఇది పూర్తిగా కనుమరుగవ్వలేదు. ఇంకా కొన్ని దేశాల్లో దీని ఉధృతి కొనసాగుతోంది. కాకపోతే, పరిస్థితి మునుపటిలా మరీ తీవ్రంగా అయితే లేదు. ఇంతలో మంకీపాక్స్ వైరస్ ప్రపంచాన్ని కలవరపెడుతోంది. పలు దేశాల్లో ఈ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. వ్యాప్తి కూడా వేగంగా జరుగుతోంది. దీంతో, ఇది మరో కరోనా మహమ్మారి కానుందా? భారీ స్థాయిలో మరణాలు సంభవిస్తాయా? లాక్డౌన్ లాంటి పరిస్థితులు వస్తాయా? అనే…
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో మరోసారి కరోనా వైరస్ కలకలం రేగింది. ఆ జట్టులోని ఓ నెట్ బౌలర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆ జట్టు ఆటగాళ్లందరినీ ఐసోలేషన్‌లో ఉంచినట్లు నిర్వాహకులు ప్రకటించారు. అయితే ఢిల్లీ జట్టులో ఇప్పటికే పలువురు ఆటగాళ్లు కరోనా బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్‌కింగ్స్‌తో ఆదివారం రాత్రి జరగాల్సిన మ్యాచ్‌పై సందిగ్ధత నెలకొంది. కాగా ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో కరోనా సోకడం ఇది రెండోసారి. గతంలో…
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఆదివారంతో పోలిస్తే సోమవారం స్వల్పంగా తగ్గింది. గత 24 గంటల్లో కొత్తగా 3,157 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,30,82,345కి చేరింది. అటు కరోనా కారణంగా 26 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. కరోనా బారి నుండి 2,723 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,25,38,976గా…
దేశంలో కరోనా కేసులు మరోసారి పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ కొత్త వేరియంట్ ప్రభావం కారణంగా కేసులు పెరుగుతున్నట్లు అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం దేశవ్యాప్తంగా 1150 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న 975 కరోనా కేసులు నమోదు కాగా.. నేడు అవి 1150కి పెరిగాయి. దీంతో ఒక్కరోజు తేడాలో 17 శాతం కరోనా కేసులు పెరిగినట్లు తెలుస్తోంది. తాజాగా నమోదైన కేసులతో కలిపి దేశంలో కరోనా కేసుల మొత్తం సంఖ్య 4,30,42,097కి చేరింది. ఇందులో 4,25,08,788 మంది…
చైనాలోని వూహాన్‌లో పురుడు పోసుకున్న కరోనా వైరస్ ఎప్పటికప్పుడు కొత్త వేరియంట్లతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. దేశంలో థర్డ్ వేవ్‌కు కారణమైన ఒమిక్రాన్ మరో కొత్త రూపం సంతరించుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఒమిక్రాన్ వేరియంట్ విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ XE వేగంగా వ్యాప్తి చెందుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఒమిక్రాన్ BA2 సబ్ వేరియంట్ కంటే XE వేరియంట్ 10 రెట్లు…
దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 31 నుంచి దేశవ్యాప్తంగా కరోనా నిబంధనలను పూర్తిగా తొలగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం బుధవారం నాడు ప్రకటించింది. అయితే బహిరంగ ప్రదేశాల్లో ప్రతి ఒక్కరూ మాస్క్ పెట్టుకోవడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అని పేర్కొంది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి సమాచారం ఇచ్చారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు గతంలో…