కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గత రెండు రోజులుగా ఏడు వేలకుపైగా నమోదవుతుండగా, నేడు ఆ సంఖ్య 8 వేలు దాటింది. గత 24 గంటల్లో కొత్తగా 8,329 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో దేశం మొత్తం కేసులు 4,32,13,435కు చేరాయి. ఇందులో 4,26,48,308 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,24,757 మంది మరణించగా, మరో 40,370 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక కొత్తగా 10 మంది మరణించగా, 4,216 మంది వైరస్‌నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 3081 మందికి పాజిటివ్ వచ్చింది. కేరళలో 2415 కేసులు, ఢిల్లీ 655, కర్ణాటక 525, హర్యానాలో 327 చొప్పున నమోదయ్యాయి. కాగా, పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతుండటంతో యాక్టివ్ కేసుల సంఖ్య 0.09 శాతానికి చేరాయి. రికవరీ రేటు 98.69 శాతం, మరణాల రేటు 1.21 శాతంగా ఉందని ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు 1,94,92,71,111 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని తెలిపింది.
అయితే .. 2019లో రాష్ట్రంలో డెంగీ కేసులు అధికమొత్తంలో నమోదు అయ్యాయని, అలాంటి పరిస్థితి ఇప్పుడు కూడా కనిపిస్తోందని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు హెచ్చరించారు. ముఖ్యంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో కేసులు అధికంగా నమోదవుతున్నాయన్నారు. గత జనవరి నుంచి ఇప్పటి వరకు జీహెచ్‌ఎంసీ పరిధిలో 158 డెంగీ కేసులు నమోదయ్యాయని, అందులో ఏప్రిల్, మే నెలల్లోనే వంద కేసులు రికార్డు అయ్యాయన్నారు.
మురికి వాడల్లో కేసుల సంఖ్య ఎక్కువగా ఉందని, అక్కడ 150 ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేశామని చెప్పారు. 10 వేల మంది శాంపిళ్లకు డెంగీ పరీక్షలు చేసినట్లు తెలిపారు. జిల్లాల్లో పెద్దగా డెంగీ ప్రభావం లేదన్నారు. పగటి దోమ వల్ల డెంగీ కేసులు పెరుగుతాయని, కాబట్టి నీళ్లు నిల్వ లేకుండా చూసుకోవాలన్నారు. తమ అంచనా ప్రకారం ఈసారి డెంగీ కేసులు పెరుగుతాయని హెచ్చరించారు.
హైదరాబాద్‌లో చెరువులు, నీటి కుంటలు ఎక్కువగా ఉన్నందున దోమలు వృద్ధి చెందాయని, అందుకే సీజన్ ప్రారంభానికి ముందే డెంగీ కేసులు పెరిగాయన్నారు. రాష్ట్రంలో 100 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కూలిపోయే స్థితిలో ఉన్నాయని, వాటిల్లో 15 భవనాలను కొత్తగా నిర్మించాలని నిర్ణయించామని తెలిపారు.
KTR: కుల పిచ్చి వాళ్ళు కావాలా?