India reported 13,086 new Covid-19 cases Tuesday, down from 16,135 infections logged Monday and 19 deaths, according to the Union Ministry of Health and Family Welfare.
తమిళనాడులో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. గడిచిన 24 గంటల్లో తమిళనాడు వ్యాప్తంగా 2వేలకు పైగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. అయితే కొత్తగా నమోదైన కేసుల్లో చెన్నైలోనే 909 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. అటు చెంగల్పట్టులో 352, కాంచీపురంలో 71, తిరువళ్లూరులో 100 చొప్పున కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు, వేలూరు జిల్లాల్లో ప్రజలు మాస్క్ ధరించాలని.. లేకుంటే…
ప్రపంచ వ్యాప్తంగా కరోనా కారణంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. చాలా దేశాల్లో వ్యాక్సిన్ ప్రక్రియ ఆలస్యంగా ప్రారంభం కావడంతో మరణాల రేటు ఎక్కువగా నమోదైంది. అయితే కరోనా వ్యాక్సిన్‌లు అందుబాటులోకి రాకపోతే ఈ మరణాల రేటు భయంకరంగా ఉండేది. ఇది అందరూ అంగీకరించాల్సిన విషయం. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కరోనాను నిరోధించినట్లు ది లాన్సెట్ జర్నల్ ఓ కథనం ప్రచురించింది. భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా నివారించగలిగిన మరణాలపై బ్రిటన్‌కు చెందిన ఇంపీరియల్ కాలేజ్ లండన్ నిపుణులు అధ్యయనం…
దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 9,923 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. సోమవారంతో పోలిస్తే ఇవాళ 22.4శాతం కేసులు తగ్గినట్లు వెల్లడించింది. తాజా కేసులతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,33,19,396కు చేరింది. మరో 17 మంది ప్రాణాలు కోల్పోగా.. ఇప్పటివరకు కరోనా బారిన పడి మృతిచెందిన వారి సంఖ్య 5,24,890కు పెరిగింది. కొత్తగా 7,293మంది రోగులు కోలుకున్నారు. వారితో కలిపి మొత్తం…
దేశంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. నెమ్మదిగా మళ్లీ మహమ్మారి తన ఉగ్రరూపాన్ని చూపిస్తోంది. గత ఫిబ్రవరి నుంచి దేశంలో కేవలం 2,3 వేలకు పరిమితం అయిన రోజూవారీ కేసులు సంఖ్య తాజాగా 12 వేలు దాటింది. గడిచిన 24 గంటల్లో దేశంలో 13,216 మంది వైరస్ బారినపడ్డారు. ప్రస్తుతం ఇండియాలో యాక్టివ్ కేసుల సంఖ్య 68,108గా ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా మహమ్మారి బారిన పడి మరో…
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఢిల్లీలోని గంగారామ్ ఆస్పత్రిలో చేరారు. కరోనా సంబంధిత సమస్యలతో ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం సోనియా గాంధీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, వైద్యులు పర్యవేక్షిస్తున్నారని కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. సోనియా త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్న ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈనెల 2న సోనియా గాంధీకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికతో ముడిపడి…