Omicron BF7 : కరోనాకు పుట్టినిల్లు చైనాలో పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కమ్యూనిటీ వ్యాప్తి కొనసాగుతుండడంతో ప్రభుత్వం పరిస్థితిని కూడా అంచనా వేయలేని విధంగా తయారైంది.
ప్రపంచవ్యాప్తంగా కొన్నాళ్లు ప్రశాంతంగా ఉన్న కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. పలు దేశాల్లో ఆంక్షలను సడలిస్తున్నప్పటికీ చైనాలో మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. చైనా మాత్రం కఠిన లాక్‌డౌన్‌లు పాటిస్తోందంటే అక్కడి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.