China: 6 నెలల తర్వాత చైనాలో తొలి కరోనా మరణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
China: ప్రపంచవ్యాప్తంగా కొన్నాళ్లు ప్రశాంతంగా ఉన్న కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. పలు దేశాల్లో ఆంక్షలను సడలిస్తున్నప్పటికీ చైనాలో మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. చైనా మాత్రం కఠిన లాక్‌డౌన్‌లు పాటిస్తోందంటే అక్కడి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. లాక్‌డౌన్‌లు విధిస్తున్నా కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా చైనాలో 6 నెలల తర్వాత మళ్లీ కొవిడ్ మరణం నమోదైంది. ఆ దేశ ఆరోగ్య శాఖ ఈ విషయాన్ని ఆదివారం అధికారికంగా ప్రకటించింది. దీంతో ఇప్పటివరకు అక్కడ కొవిడ్ మృతుల సంఖ్య 5,227కు చేరుకున్నట్లు చైనా పేర్కొంది. వైరస్‌ను కట్టడి చేసేందుకు ‘జీరో కోవిడ్ పాలసీ’ పేరిట కఠిన ఆంక్షలను ఇంకా కొనసాగిస్తూనే ఉంది డ్రాగన్ దేశం.
ఈ ఏడాది మే 26న షాంఘైకు చెందిన ఓ వ్యక్తి కొవిడ్‌తో ప్రాణాలు కోల్పోయాడు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే మరో వ్యక్తి వైరస్ కారణంగా చనిపోయాడు. బీజింగ్‌కు చెందిన ఓ 87ఏళ్ల వృద్ధుడు తాజాగా కొవిడ్‌తో చనిపోయినట్లు నేషనల్ హెల్త్ కమిషన్ వెల్లడించింది. చైనాలో దాదాపు 92 శాతం మంది కనీసం ఒక్కడోసు కరోనా టీకా తీసుకున్నారు. అయితే వృద్ధులకు టీకాలు సరిగా పంపిణీ చేయలేదని ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు మరణించిన వ్యక్తి కూడా టీకా తీసుకున్నాడా? లేదా? అనే విషయంపై ఆరోగ్య శాఖ స్పష్టత ఇవ్వలేదు.
Also Read
- Police Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలీస్‌శాఖలో భారీగా ఉద్యోగాలు.. నోటిఫికేషన్లు జారీ
- Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
- Ganesh Procession Tragedy: వినాయకుడి ఊరేగింపులో విషాదం.. జనరేటర్ ఫ్యాన్‌కు జుట్టు చిక్కుకుని బాలిక మృతి
- ENG vs SL: హడలెత్తించిన 'హ్యారీ బ్రూక్' సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
shooting at Nightclub: అమెరికాలోని నైట్‌క్లబ్‌లో కాల్పుల మోత.. ఐదుగురు మృతి, 18మందికి గాయాలు
కరోనా కట్టడికి ప్రపంచంలో ఏ దేశమూ అమలు చేయని విధంగా జీరో కోవిడ్ పాలసీని అమలు చేస్తోంది చైనా. కేసులు నమోదైన ప్రాంతాల్లో లాక్‌డౌన్ సహా కఠిన ఆంక్షలు విధిస్తోంది. వ్యాపారం, ఆర్థికవ్యవస్థలపై తీవ్ర ప్రభావం పడుతున్నప్పటికీ ఆంక్షల విషయంలో మాత్రం రాజీ పడటం లేదు. చైనాలో ఇప్పటివరకు 2,86,197 కరోనా కేసులు వెలుగుచూశాయి. వైరస్ బారినపడిన వారిలో 2,60,141 మంది కోలుకున్నారు. కొవిడ్ కఠిన ఆంక్షల కారణంగా ఝెంగ్‌జువాలో ఇటీవల ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోవడంతో చైనీయుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోన్న సంగతి తెలిసిందే. దీంతో ఆంక్షలు కొనసాగుతోన్న ప్రాంతాల్లో 3ఏళ్ల కంటే తక్కువ వయసున్న వారిపై ఆంక్షలు సడలించినట్లు అక్కడి అధికారులు ప్రకటించారు. వారికి కొవిడ్-19 నెగెటివ్ సర్టిఫికేట్ అవసరం లేదని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Mamitha Baiju : ఏడాది తిరగకుండా.. రూ. 1000 కోట్ల క్లబ్లో మమిత బైజు
-
Police Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలీస్‌శాఖలో భారీగా ఉద్యోగాలు.. నోటిఫికేషన్లు జారీ
-
Tollywood : సెన్సార్ లేట్.. ఈ వారం సినిమాలు వాయిదా?
-
ChiranjeeviOdela : ‘ప్యారడైజ్’ రిజల్ట్‌పైనే చిరంజీవి – శ్రీకాంత్ ఓదెల ప్రాజెక్ట్ ఆధారపడి ఉందా?
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
ట్రెండింగ్
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!
-
రూ.1,659కే itel Muzik 450L ఫోన్.. థియేటర్ లాంటి సౌండ్, 2,500mAh బ్యాటరీ.!
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!