తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే వున్నాయి. ప్రజలు మాస్కులు ధరించకపోవడం, భౌతిక దూరం పాటించకపోవడంతో మహమ్మారి వ్యాప్తి పెరుగుతోంది. తాజాగా తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరిగింది. రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై డీహెచ్ శ్రీనివాసరావు న్యాయస్థానికి నివేదిక సమర్పించారు. ఇదిలా వుంటే.. రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు గణాంకాలు ఇస్తుందని మరోవైపు పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఫీవర్ సర్వేలో 3 రోజుల్లోనే 1.70 లక్షల జ్వర బాధితులను గుర్తించారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వం…
1 దేశంలో కరోనా కేసుల్లో కాస్త పెరుగుదల నమోదవుతూనే వుంది. తాజాగా భారత్‌లో 2 లక్షల 71 వేల కేసులు నమోదయ్యాయి. 16.65 లక్షలమందికి పరీక్షలు నిర్వహించారు. కరోనా కారణంగా 314 మంది మరణించారు. పాజిటివిటీ రేటు స్వల్పంగా తగ్గింది. 16.28 శాతంగా నమోదైంది. గత వారం పాజిటివిటీ రేటు 13.69 శాతంగా వుండేది. భారత్ లో 7,743కు చేరింది ఒమిక్రాన్ కేసుల సంఖ్య. ఏపీలో కరోనా కేసుల్లో పెరుగుదల కొనసాగుతోంది. కొత్తగా 4,570 కోవిడ్ కేసులు…
ఇండియా కరోనా కేసులు మళ్లీ క్రమంగా పెరిగిపోతున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం… గత 24 గంటల్లో కొత్తగా 7,974 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో 343 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు వదిలారు. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,47,18,602 కు చేరుకుంది. అలాగే మరణాల సంఖ్య 4,76,478 కు చేరుకుంది. ఇక, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 87,245 యాక్టివ్ కేసులు ఉన్నట్టు బులెటిన్‌లో పేర్కొంది…
గత నెల దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వచ్చిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పటికే వివిధ దేశాలకు వ్యాప్తి చెందింది. అయితే ఇటీవలే ఈ ఒమిక్రాన్ వేరియంట్ భారత్‌లోకి కూడా ప్రవేశించింది. దీంతో పలు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదువుతున్నాయి. అయితే తాజాగా భారత్‌లో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 61కు చేరింది. భారత్‌లో ఒమిక్రాన్ ప్రభావం మహారాష్ట్రపై ఎక్కవగా కనిపిస్తోంది. రోజురోజుకు మహారాష్ట్రలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతూ వస్తున్నాయి. ఈ రోజు మరో 8 ఒమిక్రాన్ కేసులు మహారాష్ట్రలో…
దక్షిణాఫ్రికాలో గత 15 రోజుల క్రితం కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వెలుగులోకి వచ్చింది. ఇప్పుడిప్పుడే కరోనా డెల్టా వేరియంట్ నుంచి భారత్‌తో పాటు పలు దేశాలు కోలుకుంటున్న తరుణంలో ఒమిక్రాన్ బయటపడడంతో మరోసారి యావత్త ప్రపంచ దేశాలు ఉలిక్కిపడ్డాయి. డెల్టావేరియంట్ కంటే 6రెట్లు వేగంగా ఒమిక్రాన్ వేరియంట్ వ్యాపిస్తుండడం ఆందోళన కలిగించే విషయం. ఇప్పటికే పలు దేశాల్లో రోజు పదుల సంఖ్యలో ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్నాయి. అయితే భారత్‌లో కూడా ఒమిక్రాన్ తన ఉనికిని చూపెడుతోంది.…
కరోనా మహహ్మరి సృష్టించిన అల్లకల్లోలం అంతా ఇంతా కాదు. కరోనా ధాటికి ఎన్నో దేశాలు అతలాకుతలమయ్యాయి. కొన్ని దేశాలు ఇప్పటికీ కరోనా ప్రభావం నుంచి కోలుకోవడం లేదు. కరోనా కట్టడికి తీసుకువచ్చిన కోవిడ్ టీకాల పంపిణీ కూడా ఎంతో వేగవంతంగా సాగుతోంది. అయినా కూడా కరోనా మహహ్మరి రూపాలు మార్చుకోని ప్రజలపై విరుచుకుపడుతోంది. ఇప్పటికే కరోనా డెల్టా వేరియంట్‌లతో తలమునకలవుతోన్న వేళ మరో కొత్త వేరియంట్ ప్రపంచ దేశాలను సైతం మరోసారి ఉలిక్కిపడేలా చేసింది. దక్షిణాఫ్రికాలో వెలుగు…
యావత్తు ప్రపంచాన్ని భయాందోళనకు గురి చేసిన కరోనా ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. అయితే నిన్న పటాన్‌చెరు మండలం ముత్తంగి గురుకుల పాఠశాలలో కరోనా పరీక్షలు నిర్వహించగా 43 మంది విద్యార్థులతో పాటు ఒక లేడీ లెక్చిరల్ కు కరోనా పాజిటివ్‌గా నిర్థారణైంది. అయితే కరోనా సోకిన విద్యార్థులను పాఠశాలలోనే ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే కరోనా సోకిన విద్యార్థుల్లో 25 మంది విద్యార్థినీలకు వాంతులు, విరేచనాలు అయ్యాయి. వీరితో పాటు మరో ముగ్గురు బాలికలకు అస్వస్థతకు గురయ్యారు.…
భారత్‌లో రోజు వారి కరోనా కేసులు సంఖ్య భారీగా తగ్గి.. 20 వేలకు దిగువకు పడిపోయిన ఊరట కలిగిస్తున్న సమయంలో.. మరోసారి భారీగా పెరిగాయి కోవిడ్ కేసులు.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. మరోసారి 20 వేల మార్క్‌ను క్రాస్ చేశాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 23,529 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మరో 311 మంది కరోనా బారినపడి ప్రాణాలు విడిచారు. ఇక, ఇదే సమయంలో 28,718 మంది…
తెలంగాణ కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయి.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 257 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాగా… ఒక్కరు మృతిచెందారు.. ఇదే సమయంలో 409 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు… దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,57,376 కు చేరుకోగా.. రికవరీల సంఖ్య 6,47,594 కు పెరిగింది.. ఇక, ఇప్పటి వరకు కరోనాతో మృతిచెందినవారి సంఖ్య 3,870 కు చేరుకుంది..…