టుడే కోవిడ్ అప్ డేట్
By NTV WebDesk
- Follow Us :
-
-
Add as a preferred
source on google
1 దేశంలో కరోనా కేసుల్లో కాస్త పెరుగుదల నమోదవుతూనే వుంది. తాజాగా భారత్‌లో 2 లక్షల 71 వేల కేసులు నమోదయ్యాయి. 16.65 లక్షలమందికి పరీక్షలు నిర్వహించారు. కరోనా కారణంగా 314 మంది మరణించారు. పాజిటివిటీ రేటు స్వల్పంగా తగ్గింది. 16.28 శాతంగా నమోదైంది. గత వారం పాజిటివిటీ రేటు 13.69 శాతంగా వుండేది. భారత్ లో 7,743కు చేరింది ఒమిక్రాన్ కేసుల సంఖ్య.
- ఏపీలో కరోనా కేసుల్లో పెరుగుదల కొనసాగుతోంది. కొత్తగా 4,570 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఒకరు మృతి చెందారు. కరోనా నుంచి కోలుకున్నారు మరో 669 మంది బాధితులు. రాష్ట్రంలో ప్రస్తుతం 26,770 కరోనా యాక్టివ్ కేసులు వున్నట్టు వైద్యారోగ్యశాఖ తెలిపింది. రాష్ట్రంలో 24 గంటల్లో 30,022 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. చిత్తూరు జిల్లాలో 1,124, విశాఖ జిల్లాలో 1,028 కరోనా కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో 368, అనంతపురం జిల్లాలో 347 కరోనా కేసులు, నెల్లూరు జిల్లాలో 253, తూ.గో. జిల్లాలో 233 కరోనా కేసులు వచ్చాయి.
- కరోనా కేసుల నేపథ్యంలో ఏపీలో స్కూళ్లకు సెలవుల పొడిగింపుపై మంత్రి ఆదిమూలపు సురేష్ క్లారిటీ ఇచ్చారు. స్కూళ్లకు సెలవులు పొడిగించే ఆలోచన ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు మంత్రి ఆదిమూలపు సురేష్.
- దేశంలో వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. పండుగ సమయం కావడంతో.. టీకాలు ఇవ్వడం కాస్త నెమ్మదించింది. నిన్న 57.37 లక్షల మందికి పైగా టీకా వేయించుకున్నారు. 3.92 లక్షల మంది ప్రికాషన్ డోసు పొందారు. ఇప్పటివరకు మొత్తం 156.02 కోట్లకు పైగా డోసులు పంపిణీ చేశారు.
- పాఠశాలలు తెరిస్తే పిల్లలు కరోనా బారిన పడే ప్రమాదముండడంతో తెలంగాణలో సంక్రాంతి సెలవులు పొడిగించింది ప్రభుత్వం. దీంతో ఈనెల 17 నుంచి ఆన్ లైన్ తరగతులు ప్రారంభించనున్నాయి విద్యాసంస్థలు.
- తెలంగాణలో కరోనా కేసుల్లో స్వల్ప పెరుగుదల నమోదైంది. తాజాగా 2,047 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2013 మంది రికవరీ అయ్యారు. రికవరీ రేటు 96.31 శాతం వుంది. కరోనా వల్ల ముగ్గురు మరణించారు. 55 వేల 843 మందికి పరీక్షలు నిర్వహించారు. 22 వేల 48 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.
Also Read
తాజావార్తలు
-
PM Modi: పర్యావరణ పరిరక్షణతోనే ఆర్థిక ప్రగతి.. ప్రపంచానికి భారత్ ఆదర్శం
-
Indian Cinema: పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ మార్కెట్ వైపు అడుగులు వేస్తున్న ఇండియన్ సినిమాలు
-
Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్కు హైకోర్టు తీర్పు చెంపపెట్టు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
-
Petrol Pump UPI Payments: పెట్రోల్ పంపుల్లో UPI చెల్లింపులకు బ్రేక్..? డీలర్ల కీలక ప్రకటన
-
Shivam Dube: ధోనీ vs రోహిత్.. ఇద్దరిలో ఎవరు బెస్ట్ టీ20 కెప్టెన్.. దూబేకు పెద్ద సమస్యే వచ్చిందే!
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!