దక్షిణాఫ్రికాలో గత 15 రోజుల క్రితం కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వెలుగులోకి వచ్చింది. ఇప్పుడిప్పుడే కరోనా డెల్టా వేరియంట్ నుంచి భారత్‌తో పాటు పలు దేశాలు కోలుకుంటున్న తరుణంలో ఒమిక్రాన్ బయటపడడంతో మరోసారి యావత్త ప్రపంచ దేశాలు ఉలిక్కిపడ్డాయి. డెల్టావేరియంట్ కంటే 6రెట్లు వేగంగా ఒమిక్రాన్ వేరియంట్ వ్యాపిస్తుండడం ఆందోళన కలిగించే విషయం. ఇప్పటికే పలు దేశాల్లో రోజు పదుల సంఖ్యలో ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్నాయి. అయితే భారత్‌లో కూడా ఒమిక్రాన్ తన ఉనికిని చూపెడుతోంది.…
యావత్తు ప్రపంచ దేశాల్లో అల్లకల్లోలం సృష్టించిన కరోనా మహమ్మారి మరోసారి రూపాంతరం చెంది విజృంభిస్తోంది. ఇప్పుడిప్పుడే కరోనా డెల్టా వేరియంట్ నుంచి కొలుకుంటున్న దేశాలు, దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పేరువినగానే భయాందోళనకు గురవుతున్నాయి. డెల్టా వేరియంట్ కంటే 6 రెట్లు వేగంగా ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందుతుండటంతో ఇప్పటికే పలు దేశాలలో వ్యాప్తి చెందింది. ప్రపంచ వ్యాప్తంగా 719 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదైనట్లు డబ్లూహెచ్‌వో వెల్లడించింది. ఈ వేరియంట్ ఇటీవలే ఇండియాలోకి…
ఒమిక్రాన్ వేరియంట్‌ను ఎదుర్కోవడానికి అన్ని దేశాలు సిద్ధం అవుతున్నాయి.. ఊహించని విధంగా స్పీడ్‌గా విస్తరిస్తూ వస్తున్న ఈ వేరియంట్ ఇప్పటికే 38 దేశాలను తాకినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా ప్రకటించింది.. అయితే, ఇదే సమయంలో విమాన ఛార్జీలకు రెక్కలు వచ్చాయి.. ఇప్పటికే ఒమిక్రాన్ బాధిత దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కోవిడ్ పరీక్షలు తప్పనిసరి చేశాయి ఆయా దేశాలు.. ఒమిక్రాన్ మరింత విజృంభిస్తే.. మరిన్ని ఆంక్షలు తప్పవని.. అంతర్జాతీయ ప్రయాణాలు పూర్తిస్థాయిలో రద్దుచేసే అవకాశం లేకపోలేదని…
ఒమిక్రాన్ వైరస్ వేగంగా విస్తరిస్తుండడంతో నివారణ చర్యలు చేపడుతున్నా దేశాలు.. ఇక, భారత్‌లోని రాష్ట్రాలు కూడా ఈ మహమ్మారి విజృంభించకుండా కీలక నిర్ణయాలు తీసుకుంఉటన్నాయి.. ఇక, ఒమిక్రాన్ కేసులు వెలుగు చూసిన నేపథ్యంలో కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది కర్ణాటక ప్రభుత్వం.. ముందుగా సమీక్ష సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై.. ఆరోగ్య శాఖ మంత్రి సుధాకర్, మంత్రి గోవింద కారజోళ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రవికుమార్, సీనియర్ అధికారి మంజునాథ్ ప్రసాద్, బీబీఎంపీ అధికారులు, నిపుణులతో…