దేశంలో కరోనా మహమ్మారి రోజు రోజు ఉగ్రరూపం దాల్చుతున్నది. గత తొమ్మిది రోజులుగా దేశంలో మూడు లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. నిన్న కూడా దేశంలో మూడు లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. తాజా సమాచారం ప్రకారం దేశంలో 3.86 లక్షల పాజిటివ్ కేసులు నమోదు కాగా, 3500 లకు పైగా మరణాలు సంభవించినట్టు గణాంకాలు చెప్తున్నాయి. మహారాష్ట్రలో కరోనా ఉధృతి ఏ మాత్రం తగ్గడం లేదు. రోజువారీ కేసులు 60వేలు దాటిపోతున్నాయి. మహారాష్ట్రతో పాటుగా కేరళ, కర్ణాటక, ఉత్తర…
కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. జ్వరం, జలుబు, తలనొప్పి, గొంతు నొప్పితో పాటుగా ఇంకా అనేక లక్షణాలు కూడా ఇబ్బందులు పెడుతున్నాయి. అయితే కరోనా మహమ్మారి చర్మంపై కూడా ప్రభావం చూపిస్తోందని నిపుణులు పేర్కొంటున్నారు. జ్వరంతో పాటుగా చర్మంపై దద్దుర్లు వంటివి వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని వైద్యనిపుణులు చెప్తున్నారు. చర్మంపై రక్తం గడ్డగట్టడం ఎరుపు లేదా నలుపు లేదా వంకాయ రంగుల్లో చర్మం మారితే ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించాలని నిపుణులు పేర్కొంటున్నారు. ఇక కరోనా బారిన…
కడప జిల్లాలో రోజురోజుకు విపరీతంగా పెరిగి పోతున్నాయి కరోనా పాజిటివ్ కేసులు. నేడు జిల్లా వ్యాప్తంగా 219 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 60379 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా కరోనా బారిన పడి చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 57935 గా ఉంది. అలాగే ఇప్పటి వరకు కరోనా బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 552 గా నమోదుకాగా కరోనా బారిన…
దేశంలో కరోనా ఉధృతి తీవ్రంగా ఉన్నది. రోజువారీ కరోనా కేసులు రికార్డ్ స్థాయిలో నమోదవుతున్నాయి. తాజాగా దేశంలో 2,95,041 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,56,16,130కి చేరింది. ఇందులో 1,32,76,039 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 21,57,538 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో 1,67,457 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇకపోతే గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో రికార్డ్ స్థాయిలో 2023 మంది…
తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కరోనాను కట్టడి చేసేందుకు నిన్నటి నుంచి నైట్ కర్ఫ్యూ విధించారు. ఇక ఇదిలా ఉంటె, తెలంగాణ ప్రభుత్వం తాజాగా కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 6,542 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 3.67 లక్షలకు చేరింది. ఇందులో 3.19 లక్షల మంది డిశ్చార్జ్ కాగా, 46,488 కేసులు యాక్టివ్ గా…
దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్న టీకాలను వేగవంతం చేశారు. టీకాలను వేగంగా అందిస్తూ కరోనా కట్టడి చేసేందుకు సిద్ధం అయ్యారు. అయితే, టీకాలపై అవగాహన కలిగిస్తూనే కొన్ని చోట్ల టీకా తీసుకున్న వారికి కొన్ని రకాల గిఫ్ట్ లు అందిస్తున్నారు. ఇందులో భాగంగానే ఛత్తీస్ గడ్ లోని బీజాపూర్ మున్సిపాలిటీ వినూత్న నిర్ణయం తీసుకుంది. టీకా తీసుకునే వారికి ఉచితంగా టమోటాలు అందించాలని నిర్ణయం తీసుకుంది. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు, వారిని ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు బీజాపూర్…
ఇండియాలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. కరోనా మహమ్మారికి వారు వీరు అనే తేడా లేదు. ఎవరైతే అజాగ్రత్తగా ఉంటారో వారికి కరోనా సోకుతున్నది. సామాన్యుల నుంచి రాజకీయ నాయకుల వరకు ఎవర్ని కరోనా వదలడం లేదు. అనేక రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, మంత్రులు, కేంద్ర మంత్రులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సైతం కరోనా బారిన పడ్డారు. ఇటీవలే కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ కరోనా బారిన పడ్డారు. ఇక ఇదిలా…
దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి ఉదృతంగా ఉండటంతో ప్రజలు ఆందోళనలు చెందుతున్నారు. కరోనా మహమ్మారి నుంచి బయటపడాలి అంటే అర్హులైన అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలి. ఇప్పటికే దేశంలో రెండు రకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. పెద్ద సంఖ్యలో దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతున్నది. దాదాపుగా ఇప్పటి వరకు దేశంలో 12 కోట్ల మందికి పైగా వ్యాక్సిన్ అందించారు. ఎంత పెద్ద ఎత్తున వ్యాక్సిన్ లను అందిస్తున్నారో అదే లెవల్లో వ్యాక్సిన్ వృధా అవుతున్నది. దీనిపై కేంద్రం దృష్టి సారించింది. వ్యాక్సిన్ వృధాపై ప్రధాని మోడీ అసంతృప్తి…
దేశంలో కరోనా మహమ్మారి ఉదృతి కొనసాగుతోంది. కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. ప్రతిరోజూ రెండున్నర లక్షల కేసులు నమోదవుతున్నాయి. తాజాగా దేశంలో 2,59,170 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,53,21,089కి చేరింది. ఇందులో 1,31,08,582 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 20,31,977 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో 1,54,761 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యినట్టు బులెటిన్ లో పేర్కొన్నారు. …
మే 1 వ తేదీ నుంచి దేశంలో మూడో విడత వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలు కాబోతున్నది. మూడో విడత వ్యాక్సినేషన్ కు సంబంధించిన ప్రకటనను నిన్నటి రోజున కేంద్రం రిలీజ్ చేసింది. 18 ఏళ్ళు పైబడిన వ్యక్తులు అందరికి వ్యాక్సిన్ వేసుకునే వెసులుబాటును కల్పించింది. ప్రస్తుతం 45 ఏళ్ళు పైబడిన వారికీ వ్యాక్సిన్ అందిస్తున్నారు. రెండో విడత వ్యాక్సినేషన్ లో ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రిలో వ్యాక్సిన్ అందిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఫ్రీగా, ప్రైవేట్ ఆసుపత్రుల్లో నామమాత్రపు ధరలతో…