ఢిల్లీలో కరోనా కేసులు రోజురోజుకు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. ఢిల్లీని ఆక్సీజన్ కోరత వేధిస్తోంది. ఆక్సీజన్ కొరత కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో ఢిల్లీ ఆసుపత్రులకు ఆక్సీజన్ సరఫరాకు కొరత లేకుండా చేసేందుకు ఢిల్లీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వేగంగా ఆక్సీజన్ ట్యాంకర్లను తెప్పిస్తున్నాయి. రోజురోజుకు కేసులు పెరుగుతుండటంతో, ఢిల్లీ ఆసుపత్రుల్లో ఖాళీలు లేక హోమ్ ఐసోలేషన్‌లో వేలాదిమంది కరోనా రోగులు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. హోమ్ ఐసోలేషన్‌లో ఉండి ఆక్సీజన్ అవసరమైన వారికి…
దక్షిణాది రాష్ట్రాల్లో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. దక్షిణాదిన ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రంలో కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. నిన్న ఒక్కరోజే కర్ణాటక రాష్ట్రంలో ఏకంగా 50 వేలకు పైగా కేసుకు నమోదయ్యాయి. ఆంక్షలు, మినీ లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూ, లాక్ డౌన్ వంటివి విధించినా కరోనా ఏ మాత్రం కట్టడి కావడం లేదు. కేసులతో పాటుగా అటు మరణాల సంఖ్యా కూడా పెరుగుతున్నది. రాజధాని బెంగళూరులో కేసులు నిన్న ఒక్కరోజు 23 వేలకు…
దేశంలో కరోనా పాజిటివిటి రేటు పెరిగిపోతున్నది. ముఖ్యంగా గోవాలో పాజిటివిటి రేటు 51శాతంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.దేశంలోనే అత్యధిక పాజిటివిటి రేటు ఉన్న రాష్ట్రంగా గోవా రికార్డ్ కెక్కింది.కరోనా టెస్టులు చేస్తున్న ప్రతి ఇద్దరిలో ఒకరికి కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నట్టు అధికారులు చెప్తున్నారు. లాక్ డౌన్ ఆంక్షలు విధిస్తున్న కట్టడి కావడం లేదు. రోజు రోజుకు పాజిటివిటి రేటు పెరుగుతుండటంతో సంపూర్ణ లాక్ డౌన్ విధించడం ఒక్కటే మార్గం అని అక్కడి అధికారులు పేర్కొంటున్నారు. కొంతకాలం పాటు గోవా…
ఇండియాలో కరోనా మహమ్మారి రోజు రోజుకు ఉధృతం అవుతున్నది. రోజువారీ పాజిటివ్ కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. తాజాగా దేశంలో 4,12,262 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,10,77,410కి చేరింది. ఇందులో 1,72,80,844 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 35,66,398 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో రికార్డ్ స్థాయిలో 3,980 కరోనా మరణాలు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన…
తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. మరణాల సంఖ్య రోజుకు 50కి పైగా నమోదవుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. మే 8 వ తేదీతో కర్ఫ్యూ సమయం పూర్తవుతుంది. అయితే, ఈరోజు తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలో నైట్ కర్ఫ్యూ సమయం పొడిగించాలని ఆదేశించింది. వీకెండ్ లాక్ డౌన్ పై ఎందుకు నిర్ణయం తీసుకోవాలని, ఈనెల…
ఇండియాలో కరోనా మహమ్మారి ఉధృతి తీవ్రంగా ఉన్నది. రోజువారీ కేసులు మూడున్నర లక్షలకు పైగా నమోదవుతున్నాయి. తాజాగా దేశంలో గడిచిన 24 గంటల్లో 3,82,315 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,06,65,148 కి చేరింది. ఇందులో 1,69,51,731 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 34,87,229 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో 3780 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో దేశంలో…
తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. తాజాగా ప్రభుత్వం కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 6361 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,69,722 కి చేరింది. ఇందులో 3,89,491 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 77,704 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక రాష్ట్రంలో కరోనాతో 51 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో నమోదైన…
దేశంలో మహమ్మారి కేసులు రోజు రోజుకు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. రోజుకు మూడున్నర లక్షలకు పైగా కేసులు నమోదవుతున్న తరుణంలో కేసులను కంట్రోల్ చేయకుంటే ఆరోగ్యవ్యవస్థ కుప్పకూలే అవకాశం ఉన్నది. దీంతో రాష్ట్రాల్లోని కోర్టులు కరోనా మహమ్మారి విషయంలో జోక్యం చేసుకుంటున్నాయి. కరోనా మహమ్మారిని కంట్రోల్ చేయడానికి తీసుకుంటున్న చర్యలను వివరించాలని ఆదేశాలు జారీ చేస్తున్నాయి. తాజాగా, బీహార్ హైకోర్టు ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. బీహార్ లో రోజువారీ కేసులు పెరుగుతుండటంతో పాటుగా, హైకోర్టు కూడా కీలక ఆదేశాలు జారీ…
ఇండియాలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. ప్రతిరోజూ మూడున్నర లక్షలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. కరోనా కేసులతో పాటుగా మరణాల సంఖ్య కూడా పెరిగిపోతున్నది. తాజాగా ఇండియాలో 3,57,229 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,02,82,833కి చేరింది. ఇందులో 1,66,13,292 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 34,47,133 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. దేశంలో రెండు కోట్లకు పైగా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో దేశవ్యాప్తంగా కఠిన ఆంక్షలు…
కరోనా మహమ్మారి రోజు రోజుకు విజృంభిస్తోంది. కరోనా విజృంభిస్తున్న సమయంలో మళ్ళీ ఒక్కొక్క రంగం తిరిగి మూతపడుతున్నది. దీంతో ఆయా రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోతున్నారు. దేశంలో ఏప్రిల్ నెలలో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ తీవ్ర రూపం దాల్చింది. దేశంలో రోజుకు మూడున్నర లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. రోజువారీ మరణాల సంఖ్య భారీగా పెరిగింది. లాక్ డౌన్ పెట్టాలనే ఒత్తిడి పెరిగింది. అనేక ప్రాంతాల్లో ఇప్పటికే పాక్షిక లాక్ డౌన్ ను విధించారు. …