చూస్తుండగానే కోవిడ్ 19 సెకండ్ వేవ్ అదుపు తప్పిపోవడం ఆందోళనకరంగా మారింది, రోజుకు రెండు లక్షల కేసులకు మించి నమోదవడం మొదటి దఫా పరిస్తితిని మించిపోయింది.కేసులు ఎక్కువగా వున్నా మరణాలు ఆ స్తాయిలో లేవని మొదట అనుకున్నారు గాని ఆ సంతోషం కూడా ఆవిరైపోయింది. మొదటి దఫాలో మరణాల రేటు 1.1 శాతం లోపే ఉండగా ఇప్పుడు 1.3 శాతం దాటిపోయిందని లెక్కలు చెబుతున్నాయి. పైగా పెరుగుదల వేగం కూడా గతం కంటే చాలా ఎక్కువగా వుంది.గతంలో…
కరోనా సెకండ్‌వేవ్ పంజా విసురుతోంది.. కరోనా మహమ్మారి తొలినాళ్లలో అన్ని ఆలయాలు మూతపడి.. క్రమంగా ఆ తర్వాత తెరుచుకున్నాయి.. ఇప్పుడు సెకండ్ వేవ్ ఉధృతితో అధికారులు అప్రమత్తం అవుతున్నారు.. రాజన్నసిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో కరోనా కేసులు విజృంభిస్తుండడంతో.. ఈ నెల 18వ తేదీ నుండి 22 వరకు రాజన్న ఆలయాన్ని మూసివేయాలని నిర్ణయించారు అధికారులు.. మొత్తంగా ఐదు రోజుల పాటు భక్తుల దర్శనానికి అనుమతి రద్దు చేశారు దేవాదాయ శాఖ అధికారులు.. ఇక, ఈనెల 21న రాజన్న…
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ళ నాని అన్ని జిల్లాల డిఎంహెచ్వో లతో టెలికాన్ఫరెన్స్ ను నిర్వహించారు. కరోనా కేసులు అధికంగా ఉన్న కృష్ణా, గుంటూరు, విశాఖ, నెల్లూరు, తూర్పు గోదావరి, చిత్తూరు జిల్లాలపై ఫోకస్ పెట్టాలని సూచించారు. రానున్న ఆరువారాల్లో కరోనా కేసులు భారీగా పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించడంతో కేసులు ఎక్కువ ఉన్న జిల్లాలపై దృష్టి పెట్టాలని మంత్రి సూచించారు. వైరస్ వ్యాప్తి గతానికంటే వేగంగా ఉందని, ఆసుపత్రుల్లో బెడ్స్ ను…
తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్న నేపథ్యంలో ఆంక్షలను కఠినం చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో మాస్క్ ను తప్పనిసరి చేశారు. మాస్క్ లేకుండా బయట కనిపిస్తే భారీ జరిమానా విధిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటె తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 3307 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య…
ఇండియాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజువారీ పాజిటివ్ కేసులు రికార్డ్ స్థాయిలో నమోదవుతున్నాయి. ఈరోజు ఎప్పుడు లేనంతంగా కేసులు నమోదయ్యాయి. కేంద్రం రిలీజ్ చేసిన కరోనా బులెటిన్ ప్రకారం దేశంలో కొత్తగా 2,00,739 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,40,74,564కి చేరింది. ఇందులో 1,24,29,564 మంది దేశంలో కోలుకొని డిశ్చార్జ్ కాగా, 14,71,877 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో 93,528 మంది కోలుకొని…
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. కరోనా కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్న నేపథ్యంలో అధికారులు ప్రజలను అలర్ట్ చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటె వరంగల్ జిల్లాలోని పర్వతగిరి మండలంలోని ఏనుగల్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మంగళవారం రాత్రి మరణించాడు. మరణించిన వ్యక్తికీ బుధవారం రోజున అంత్యక్రియలు నిర్వహించారు. అయితే, అంత్యక్రియలు నిర్వహించిన తరువాత ఆశా వర్కర్ మొబైల్ కు ఓ మెసేజ్ వచ్చింది. మరణించిన వ్యక్తికీ కరోనా పాజిటివ్ వచ్చినట్టు మెసేజ్ వచ్చింది. అయితే, అప్పటికే మరణించిన వ్యక్తికీ అంత్యక్రియలు నిర్వహించడం, ఆ…
హరిద్వార్ లో ప్రస్తుతం కుంభమేళా జరుగుతున్నది. ప్రపంచంలోనే అత్యంత పెద్ద వేడుకల్లో కుంభమేళా కూడా ఒకటి. ఇలాంటి వేడుకలకు కోట్లాది మంది భక్తులు హాజరవుతుంటారు. నాలుగు నెలలపాటు ఈ వేడుక జరగాల్సి ఉన్నా, కరోనా కారణంగా నెలకు కుదించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ కుంభమేళాను నిర్వహిస్తున్నారు. అయితే, కుంభమేళలో శాహిస్నాన్ ముఖ్యమైనది. ఈ శాహి స్నాన్ వేడుకలో లక్షలాది మంది సాధువులు పాల్గొంటారు. బుధవారం రోజున జరిగిన ఈ రాజస్నానం వేడుకలో సుమారుగా 13.5 లక్షల మంది సాధువులు, నాగా సాధువులు పాల్గొన్నారని అధికారులు చెప్తున్నారు. అయితే,…
దేశంలో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. సెకండ్ వేవ్ దెబ్బకు ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. రోజూ లక్షల కేసులు నమోదవుతున్నాయి. జాగ్రత్తలు తీసుకుంటున్నా, మహమ్మారి ఏ మాత్రం తగ్గడం లేదు. పైగా కరోనా దెబ్బకు కుటుంబాలు విచ్చిన్నం అవుతున్నాయి. ఒక ఇంట్లో ఒకరికి కరోనా సోకితే ఆ ప్రభావం మొత్తం ఇంటిపై పడుతున్నది. తాజాగా మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లిలో ఓ భర్తకు కరోనా సోకింది. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నాడు. అయితే, భర్త కరోనా నుంచి కోలుకోడేమో అనే సందేహంతో అయన భార్య…
ఇండియాలో కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. రోజువారీ కేసులు లక్షకు పైగా నమోదవుతుండగా ఈరోజు ఏకంగా రెండు లక్షలకు చేరువలో కేసులు నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా దేశంలో 1,85,190 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,38,73,825 కి చేరింది. ఇందులో 1,23,36,036 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 13,65,704 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక దేశంలో కరోనాతో 24 గంటల్లో 1026 మంది మృతి చెందారు. దీంతో ఇండియాలో ఇప్పటి…
తెలంగాణలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. తాజాగా ప్రభుత్వం కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. రాత్రి 8 గంటల వరకు మొత్తం 72,364 కరోనా టెస్టులు నిర్వహించగా 2157 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,34,738కి చేరింది. ఇందులో 3,07,499 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 25,459 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక కరోనా బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో ఎనిమిది…