అక్షయ్ కుమార్ తన దాతృత్వం మరోసారి చాటుకున్నాడు. అలాగే, దేశ భద్రతా దళాలపై తనకున్న గౌరవాన్ని కూడా మళ్లీ ఆయన ఋజువు చేసుకున్నాడు. జూన్ 16న జమ్మూలోని లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద ఉన్న తులైల్ ప్రాంతాన్ని సందర్శించాడు. అక్కడి బీఎస్ఎఫ్ జవాన్లతో మాటామంతీ సాగించిన ఆయన స్కూల్ భవనం కోసం కోటి రూపాయలు విరాళం ప్రకటించాడు!మారుమూల పల్లెలో అక్షయ్ విరాళంతో నిర్మించబోయే పాఠశాలకి ఆయన తండ్రి హరీ ఓం పేరును పెట్టనున్నారు. అయితే, జమ్మూలోని బందిపోరా…