కాంగ్రెస్కు హుజురాబాద్లో కొత్త కష్టాలు మొదలయ్యాయి. లోకల్పార్టీ నాయకులు సరికొత్త రాగం అందుకున్నారు. మాజీ మంత్రి కొండా సురేఖకు టికెట్ ఇస్తున్నారని తెలియడంతో.. లోకల్ మంత్రం జపిస్తున్నారట అక్కడి కాంగ్రెస్ నాయకులు. అదే పీసీసీ పెద్దలను చికాకు పెట్టిస్తోందట. హుజురాబాద్ కాంగ్రెస్ నేతల కొత్త రాగం! హుజురాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్, బీజేపీలకు భిన్నంగా వెళ్లాలన్నది కాంగ్రెస్ ఆలోచన. అక్కడ ఉన్న ఓటు బ్యాంక్ను కాపాడుకోవడం మొదటి లక్ష్యమైతే.. బలమైన అభ్యర్థిని బరిలో దించితే పరువు కాపాడుకోవచ్చన్నది మరో…
కేంద్రంలో బీజేపీ, కాంగ్రెసేతర కూటమి కోసం ఎప్పటి నుంచి ప్రయత్నాలు సాగుతున్నాయి.. మరోవైపు.. బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలు ఏకం కావాలనే ఆలోచనలు కూడా చేస్తున్నారు.. అయితే, థర్డ్ ఫ్రంట్, కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు మాజీ ప్రధాని దేవెగౌడ.. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇప్పటి పరిస్థితుల్లో కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్ యేతర ప్రభుత్వం రావడం కష్టమన్నారు.. మొదట అన్ని ప్రాంతీయ పార్టీలు ఒక్క వేదిక పైకి రావాలన్నారు.. ప్రాంతీయ పార్టీలు ఆయా…
ప్రధాని నరేంద్ర మోడీ తెస్తానన్న అచ్చే దిన్ అంటే ప్రభుత్వరంగ సంస్థలను అమ్మడం, తాకట్టు పెట్టడమేనా? అని ప్రశ్నించారు రాజ్యసభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ మల్లికార్జున ఖర్గే.. హైదరాబాద్ వచ్చిన ఆయన.. గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తోందని విమర్శించారు. నేడు ప్రభుత్వ రంగ సంస్థల్లో 35 లక్షల మంది పనిచేస్తున్నారని.. కానీ, మోడీ ఒక్కో రంగాన్ని ఖతం చేస్తున్నారని మండిపడ్డారు.. మరోవైపు రిజర్వేషన్లను సైతం…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అంటే రాజకీయ మహామహులకు కేంద్రం. అందులో ఎవరు.. ఎప్పుడు.. ఎలా స్పందిస్తారు.. ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు.. తమకు అనుకూలంగా రాజకీయపరమైన పరిణామాలు ఎలా క్రియేట్ చేసుకుంటారు అన్నది ఆసక్తికరంగానే ఉంటుంది. తాజాగా.. ఈ టాపిక్ కు.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కారణం అయ్యారు. ఇప్పటికే కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ గా తీవ్రంగా వ్యతిరేకించి.. భంగపడి.. చివరికి పీసీసీ పోస్టు అమ్ముడుపోయిందని సంచలన ఆరోపణలు చేసి.. ఇప్పటి వరకూ రేవంత్…
వైఎస్ఆర్ ఆత్మీయ సమ్మేళనానికి అనేక మంది మాజీ మంత్రులు, నేతలు హాజరయ్యారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి కూడా హాజరయ్యారు. ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలో నిరూపించిన వ్యక్తి వైఎస్ఆర్ అని, విజయమ్మ ఆహ్వానం మేరకు తప్పకుండా వస్తానని చెప్పానని, చెప్పినట్టుగానే వచ్చానని అన్నారు. ఉదయం 7గంటలకు తాను బయలుదేరి వచ్చినట్టు తెలిపారు. ఆత్మీయ సమావేశానికి ఎందుకు వెళ్లకూడదని కాంగ్రెస్ ఆదేశాలు ఇచ్చిందో తెలియదని అన్నారు. పార్టీని అధికారంలోకి తెచ్చిన వ్యక్తి…
కాంగ్రెస్ రాజకీయమే అంత. ముఖ్యంగా హైకమాండ్ పాలిటిక్స్. దేన్నీ అంత తొందరగా తేల్చదు. అంతా నీదే అంటుంది..కానీ ఆ మాట నేతలందరితో అంటుంది. అదే కాంగ్రెస్ స్పెషాలిటీ. ఎవరి మాట తీసేయదు..అలాగే ఎవరికీ పెద్ద పీఠ వేసి కూర్చోపెట్టదు. కాంగ్రెస్ మార్క్ రాజకీయం అంటేనే అది. ఇప్పుడు హుజూరాబాద్లోనూ అదే జరుగుతోంది. ఈ నెలలోనే ఉప ఎన్నికలు తప్పేలా లేవు. టీఆర్ఎస్ తన అభ్యర్థిని ప్రకటించింది. బీజేపీకి ఈటల రాజేందర్ ఉండనే ఉన్నారు. ఇక మిగిలింది కాంగ్రెస్.…
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారా అంటే అవుననే అంటున్నాయి ప్రస్తుత పరిస్థితులు. కాంగ్రెస్ పార్టీలో చేరే విషయంపై ప్రశాంత్ కిషోర్ ఇప్పటి వరకూ ఎలాంటి సమాచారం ఇవ్వకున్నా, గత కొన్ని రోజులుగా ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీతో సన్నిహితంగా మెలుగుతున్నారు. ఇక ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరికపై అధిష్టానం ఇప్పటికే చర్చలు మొదలుపెట్టింది. కాంగ్రెస్ కీలక నేతలతో ఈ విషయంపై చర్చిస్తున్నట్టు సమాచారం. సీనియర్ నేతలు కొంతమంది ప్రశాంత్ చేరికను వ్యతిరేకిస్తున్నారు.…
రేవంత్ రెడ్డి పీసీసీ, బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కావడానికి కారణం సీఎం కేసీఆర్ మాత్రమే. గులాబీ జెండా పుణ్యమే మీకు అధ్యక్ష పదవులు వచ్చాయని మంత్రి హరీష్ రావు అన్నారు. కాబట్టి మీరు చేయాల్సింది పాదయాత్రలు కాదు… పెంచిన గ్యాస్ , డీజిల్ ధరల పై ఢిల్లీ యాత్రలు చేయాలి. టీఆర్ఎస్ పార్టీ జల దృశ్యంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి ఢిల్లీ దాకా పోయింది. రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా అభివృధి లో ఇతర రాష్ట్రాలకు…
తెలంగాణ వేదికగా హుజూరాబాద్ రాజకీయం రకరకాల మలుపులు తిరుగుతోంది. ఉప ఎన్నికకు కారణమైన మాజీ మంత్రి ఈటల రాజేందర్.. బీజేపీ అభ్యర్థిగా నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. పోటీగా.. అధికార టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్.. పోటాపోటీ వాడీవేడీ ప్రచారం చేస్తున్నారు. ఇదే సమయంలో.. కాంగ్రెస్ మాత్రం ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేక మల్లగుల్లాలు పడుతోంది. కొన్నాళ్లపాటు కొండా సురేఖ పేరు బలంగానే వినిపించింది. కానీ.. ఆమె సుముఖంగా ఉన్నారా లేదా.. అన్నది కూడా సరైన స్పష్టత రాకుండా…
దేశంలో మరోసారి గ్యాస్ ధరలు పెరిగిన సంగతి తెలిసిందే. చమురు కంపెనీలు ప్రతినెలా సమీక్షించి ధరలను పెంచడమో లేదా తగ్గించడమో చేస్తుంటాయి. అయితే, గత కొన్ని నెలలుగా గ్యాస్ ధరలు పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సెప్టెంబర్ నెలలో వంటగ్యాస్ ధరను రూ.25 పెంచడంపై కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014 నుంచి దేశంలో గ్యాస్ ధరలు 116 శాతం పెరిగినట్టు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. యూపీఏ హయాంలో క్రూడాయిల్ ధర…