ఆస్కార్ ఫెర్నాండెజ్ మృతికి పలువురి సంతాపం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు ఆస్కార్ ఫెర్నాండెజ్ అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన వయస్సు 80 సంవత్సరాలు.. కొన్ని రోజులుగా మంగళూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన… ఇవాళ తుదిశ్వాస విడిచారు. జులైలో యోగా చేస్తూ పడిపోవడంతో ఫెర్నాండెజ్ తలకు గాయమై, రక్తం గడ్డ కట్టింది. డాక్టర్లు సర్జరీ చేశారు. ఐతే చికిత్స తర్వాత కూడా ఫెర్నాండెజ్ కోలుకోలేకపోయారు. పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. ఫెర్నాండెజ్ గాంధీ కుటుంబానికి ఆప్తులు. సోనియా, రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితులు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి పార్లమెంట్ సెక్రటరీగా ఫెర్నాండెజ్ వ్యవహరించారు. అందుకే కాంగ్రెస్ పార్టీలో ఫెర్నాండెజ్‌ను మ్యాన్ ఆఫ్ ఆల్ సీజన్స్‌గా పిలుచుకుంటారు. యూపీఏ 1 హయాంలో కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రిగా, ఏఐసీసీ జనరల్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహించారు ఫెర్నాండెజ్.
ఆస్కార్ ఫెర్నాండెజ్ 1941 మార్చి 27న కర్ణాటకలోని ఉడుపిలో జన్మించారు. ఆయన తండ్రి రోక్ ఫెర్నాండెజ్ హెడ్ మాస్టర్. సెయింట్ సీసిలీస్ కాన్వెంట్ స్కూల్లో విద్యను అభ్యసించిన ఆస్కార్ ఆ తర్వాత ఎంజీఎం కాలేజీలో చదువుకున్నారు. కొంతకాలం వ్యవసాయం చేశారు. ఉత్తమ వరి ఉత్పత్తిదారుడి అవార్డు కూడా అందుకున్నారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న ఆస్కార్ ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్లారు. కాంగ్రెస్‌లో చేరి… అత్యున్నతస్థాయికి ఎదిగారు. స్పోర్ట్స్ అంటే ఆస్కార్ ఫెర్నాండెజ్‌కు అమితాసక్తి. కబడ్డీ, వాలీబాల్, స్విమింగ్ అంటే ఆయనకు ఎంతో ఇష్టం. యక్షగానంలో ఆయన దిట్ట. కూచిపూడి కూడా నేర్చుకున్నారు. బహుముఖ ప్రజ్ఞాశీలి అయిన ఫెర్నాండెజ్‌ను కోల్పోవడం పార్టీకి తీరని లోటని గుర్తు చేసుకున్నారు కాంగ్రెస్ నేతలు. ఇటు, తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఫెర్నాండెజ్ మృతికి సంతాపం తెలిపారు..
Also Read
- SIR Row: ఈసీలో అంతర్గత విభేదాలు.. ‘‘దేశ ద్రోహం’’ అంటూ రాహుల్ విమర్శలు..
- Meghalaya BJP Expansion: మేఘాలయ అసెంబ్లీలో మారిన రాజకీయ లెక్కలు.. బీజేపీలోకి 8 మంది UDP ఎమ్మెల్యేలు
- Kaushik Reddy: కౌశిక్ రెడ్డి ఎపిసోడ్‌పై ముగిసిన ఎథిక్స్ కమిటీ సమావేశం..!
- ECI on SIR Row: ఓటర్ల జాబితా SIRపై రగడ.. అంతర్గత విభేదాల వార్తలను తోసిపుచ్చిన ఈసీ
తాజావార్తలు
-
YS Jagan: అవినీతి ఏ స్థాయికి వెళ్లిందో చెప్పడానికి డీఎస్సీనే ఉదాహరణ!
-
SIR Row: ఈసీలో అంతర్గత విభేదాలు.. ‘‘దేశ ద్రోహం’’ అంటూ రాహుల్ విమర్శలు..
-
Banks Open on Sunday: బ్యాంక్ సమ్మెకు ముందు కీలక నిర్ణయం.. ఆదివారం కూడా బ్యాంకులు ఓపెన్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
Meghalaya BJP Expansion: మేఘాలయ అసెంబ్లీలో మారిన రాజకీయ లెక్కలు.. బీజేపీలోకి 8 మంది UDP ఎమ్మెల్యేలు
ట్రెండింగ్
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్‌షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!