కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ఉస్మానియా పర్యటనపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.. మరోసారి హైకోర్టును ఆశ్రయించింది కాంగ్రెస్ పార్టీ.. రాహుల్ గాంధీ ఉస్మానియా యూనివర్సిటీ సందర్శనకు వర్సిటీ వీసీ అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే కాగా.. రాహుల్ గాంధీ ముఖాముఖి కార్యక్రమానికి అనుమతి కోరుతూ ఎన్ఎస్యూఐ ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం.. విచారణ చేపట్టిన న్యాయస్థానం.. పిటిషనర్ల దరఖాస్తుపై నిర్ణయాన్ని ఓయూ వీసీకే వదిలేయడం జరిగిపోయాయి.. ఇదే సమయంలో ఈ నెల 5వ తేదీలోగా…
ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ ఈ నెల 6,7 తేదీల్లో తెలంగాణలో పర్యటించనున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సీటీని సందర్శించేందుకు ఓయూ వీసీని అనుమతులు కోరగా.. ఆయన నిరాకరించారు. దీంతో ఎన్ఎస్యూఐ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో విచారణ చేపట్టిన హై కోర్టు నిర్ణయాన్ని.. ఓయూ వీసీకే వదిలేసింది. అయితే.. ఈ నెల 5వ తేదీలోగా నిర్ణయం తీసుకుని, వారికి తెలియజేయాలని ఓయూ అధికారులను ఆదేశించింది హై కోర్టు. అయితే తాజాగా మరోసారి రాహుల్ గాంధీ…
తెలంగాణ కాంగ్రెస్‌లో కొందరు సీనియర్ నాయకులతో AICC రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్ ఇటీవల హైదరాబాద్‌లోని MLA క్వార్టర్స్‌లో సమావేశం అయ్యారు. ఆ సమావేశానికి కేవలం 9 మంది నేతలనే పిలిచారు ఠాగూర్. వీరితోపాటు కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కూడా హాజరయ్యారు. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, మధు యాష్కీ, ఉత్తమ్ కుమార్‌రెడ్డి.. దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీటింగ్‌కు వెళ్లారు. సాధారణంగా సమావేశం సీనియర్ నేతలకే పరిమితమైతే పెద్దగా…
గతంలో మేము ఉచిత విద్యుత్ ఇచ్చి రూపాయి ప్రచారం చేసుకున్నాం. కానీ కేసీఆర్ ఇచ్చే విద్యుత్ కి అయ్యేంత ఖర్చు పబ్లిసిటీకి పెడుతున్నారు. లక్ష రూపాయలు మాఫీ మేము చేశాం… కేసీఆర్ చేయకపోయినా చేసినట్టు ప్రచారం చేసుకుంటున్నారు. చేసేది పది పైసల పని… చేసేది వంద రూపాయల ప్రచారం. టీఆర్ఎస్ ది గ్రాఫిక్స్ పాలన అని మండిపడ్డారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి. శివాజీ సినిమా..రజినీకాంత్ స్టైల్ లో ఉంది కెసిఆర్ పాలన. సభ ద్వారా రుణమాఫీ ఏమైంది అని…
తెలంగాణలో వచ్చే 10 ఏళ్లు కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉంటుందని తెలిపారు తెలంగాణ పీసీసీ చీప్ రేవంత్‌రెడ్డి.. ఎన్టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు అంశాలపై స్పందించారాయన.. ఈ సందర్భంగా ఎన్నికలు, అధికారం గురించి మాట్లాడుతూ.. 2023 నుంచి 2033 వరకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంటుందన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. 94 నుంచి 2004 టీడీపీ, 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్, 2014 నుంచి 2023 వరకు టీఆర్ఎస్ పార్టీలు పదేళ్లు అధికారంలో…
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించారు పీకే. తాను రాజకీయ పార్టీ పెడుతున్నట్లు ట్వీట్ చేశారు. త్వరలో కొత్త ప్రయాణం ప్రారంభించబోతున్నానని.. పూర్తి స్థాయిలో ప్రత్యక్ష రాజకీయాల్లో వస్తున్నానని తెలిపారు. పదేళ్లుగా ప్రజల పక్షాన విధానాలు రూపొందించానని.. అర్థవంతమైన ప్రజాస్వామ్యం కోసం పని చేశానని చెప్పారు పీకే. తన సొంత రాష్ట్రం బీహార్ నుంచి ప్రశాంత్ కిషోర్ రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టనున్నారు. జన్ సురాజ్ పేరిట…
ఇప్పుడు వరంగల్‌లో రాజకీయ పరిణామాలు హీట్ పెంచుతున్నాయి.. ఇప్పటికే వరంగల్‌లో పలు సార్లు మంత్రి కేటీఆర్ పర్యటించారు.. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పర్యటన ఖరారైన తర్వాత కూడా ఈ మధ్యే వరంగల్‌కు వెళ్లివచ్చారు.. ఇప్పుడు మరోసారి అదే జిల్లాలో టూర్‌కు సిద్ధం అయ్యారు. అది కూడా రాహుల్ గాంధీ సభ ముగిసిన మరుసటి రోజే కావడం ఆసక్తికరంగా మారింది. ఈ నెల 6వ తేదీన వరంగల్ వస్తున్నారు రాహుల్.. రైతు సంఘర్షణ సభ పేరుతో భారీ…
కాంగ్రెస్ పార్టీలో రెడ్డి సామాజికవర్గం డామినేషన్ ఎక్కువ. అలాంటి పార్టీలో బీసీ సామాజికవర్గానికి చెందిన మధుయాష్కీ పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్‌గా.. మహేష్‌గౌడ్ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పార్టీ సంస్థాగత వ్యవహారాలను మహేష్‌గౌడే పర్యవేక్షిస్తున్నారు. ఇద్దరు బీసీ నేతలు పార్టీలో కీలక పదవుల్లో ఉన్నప్పటికీ సఖ్యత లేదు. నిత్యం కయ్యమే. గాంధీభవన్‌లో ఇద్దరు గౌడ్లు కలిశారంటే.. ఉప్పు నిప్పులా ఉంటారు. అసలు ఈ ఇద్దరికీ ఎక్కడ తేడా కొట్టింది అనేది ఎవరికీ అంతుచిక్కదు.…
ఇప్పుడు దేశమంతా రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అడుగుల గురించే చర్చ సాగుతోంది. ప్రశాంత్ కిషోర్ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారంటూ వార్తలు షికార్లు చేస్తున్నాయి. కాంగ్రెస్‌లో చేరేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో సొంత కుంపటి పెట్టుకుంటారనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. నేడు ఆయన పార్టీని ప్రకటించనున్నట్టు కూడా ఉత్తరాది రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. ట్విట్టర్లోనూ ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అయింది. వ్యూహకర్త బాధ్యతల నుంచి తప్పుకుని ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగాలని, తన సత్తా ఏంటో…