తెలంగాణ రాజకీయాల్లో మునుగోడు ఉప ఎన్నిక కాకరేపుతోంది… అధికార, ప్రతిపక్షాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఎన్నికల్లో ఆపరేషన్ ఆకర్ష్ ఓవైపు, జంపింగ్‌లు మరోవైపు.. బంధుత్వాలో ఇంకోవైపు.. ఈ ఎన్నికను ఆసక్తికరంగా మారుస్తున్నాయి.. తాజాగా టి.పీసీసీ స్టార్ క్యాంపెనర్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రంగంలోకి దిగారు.. ఆయన కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో మాట్లాడిన ఓ ఆడియో లీక్ కలకలం రేపుతోంది… తమ్ముడి తరపున ప్రచారం చేస్తున్న వెంకట్‌రెడ్డి… కాంగ్రెస్ శ్రేణులకు ఫోన్ చేసి దొరికిపోయారు.. ఆ ఆడియోలో బీజేపీ…
ఈ మధ్య కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి.. ఢిల్లీ వెళ్లి బీజేపీ గూటికి చేరిన సీనియర్ రాజకీయ నేత దాసోజు శ్రవణ్ కుమార్.. ఇప్పుడు బీజేపీకి ఊహించని షాక్ ఇచ్చారు.. అసలు మునుగోడు ఉప ఎన్నిక సమయంలో.. ఇతర పార్టీల నేతలను ఆకర్షించే పనిలో కమలం పార్టీ నేతలు ఉండగా.. బీజేపీకి రాజీనామా చేశారు దాసోజు.. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు రాజీనామా లేఖ పంపిన ఆయన.. ఇవాళ సాయంత్రం.. టీఆర్ఎస్ వర్కింగ్…
‘‘Krishna Also Talks Of Jihad To Arjun’’- Congress leader's controversial comments: సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ స్పీకర్, కేంద్ర మంత్రి శివరాజ్ పాటిల్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. జీహాద్ అనే భావన కేవలం ఇస్లాం మతంలోనే కాదు.. భగవద్గీత, క్రైస్తవంలో కూడా ఉందని వ్యాఖ్యానించారు. పాటిల్ చేసిన ఈ వ్యాఖ్యలపై బీజేపీ విరుచుకుపడుతోంది. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు. మొహసినా కిద్వాయ్ జీవిత చరిత్రను ఆవిష్కరించే సందర్భంగా…
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఆంధ్రప్రదేశ్‌లో ముగిసింది.. తుంగభద్ర బ్రిడ్జిపై కర్ణాటకలోకి అడుగుపెట్టారు రాహుల్ గాంధీ… అయితే, ఈ సందర్భంగా ఏపీ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ.. సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేశారు.. భారత్ జోడో యాత్రకు విశేష స్పందన లభించినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుకున్న ఆయన.. ఇక్కడి వ్యక్తులతో నేను అనుభవించిన ప్రేమ బంధం లోతైనది మరియు దృఢమైనది అని రాసుకొచ్చారు.. అంతే కాదు.. ఈ ప్రేమకు…
ఆంధ్రప్రదేశ్ లో పాదయాత్ర ముగించుకుని.. మరోసారి కర్ణాటకలో అడుగుపెట్టబోతున్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. తుంగభద్ర డ్యామ్ మధ్యలో ఏపీ సరిహద్దు ముగిసి.. కర్ణాటక సరిహద్దులోకి ప్రవేశించనున్నారు రాహుల్ గాంధీ
Heavy Rain in Bengaluru, Many Roads Flooded, Cars Damaged: బెంగళూర్ నగరం వరసగా కురుస్తున్న వర్షాలతో అతలాకుతలం అవుతోంది. గత నెల కురిసిన వర్షాల కారణంగా చాలా ఏరియాలు నీటిలో మునిగిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే బుధవారం బెంగళూర్ నగరంలో భారీ వర్షం కురిసింది. బెల్లందూర్ బెల్లందూరు ఐటీ జోన్‌తో సహా నగరంలోని తూర్పు, దక్షిణ, మధ్య ప్రాంతాల్లో రోడ్లు జలమయం అయ్యాయి. రాజమహల్ గుట్టహళ్లిలో 59 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయినట్లు…
ప్రధాని నరేంద్ర మోడీ చేతిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలుబొమ్మలా మారిందంటూ సంచలన ఆరోపణలు చేశారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ… ఆయన చేపట్టిన భారత్ జోడో పాదయాత్ర ప్రస్తుతం ఏపీలో కొనసాగుతుండగా.. అందులో భాగంగా కర్నూలు జిల్లా ఆదోని మండలం ఆరేకల్‌లో నిర్వహించిన బహిరంగసభలో మాట్లాడారు.. ఏపీ ప్రభుత్వ రిమోట్ కంట్రోల్ బీజేపీ దగ్గర ఉంది… అంతే కాదు రాష్ట్రంలోని అన్ని పార్టీల రిమోట్ కంట్రోల్ కూడా భారతీయ జనతా పార్టీ చేతిలోనే ఉందని ఆరోపించారు.. ఇక,…
Nagpur Panchayat Elections : సాక్షాత్తూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ బువాంకులేల సొంత జిల్లా నాగ్‌పూర్‌లో బీజేపీకి షాక్ తగిలింది.