మునుగోడులో టీఆర్ఎస్ గెలవడం ఖాయమని కరీంనగర్ జిల్లా మాజీ ఎంపీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. ఉచితాలపై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై జనం నిరసనతో ఉన్నారని తెలిపారు. ట్యాక్సీ కట్టే సంపన్న వర్గాలకు మద్దతుగా మోడీ మాట్లాడటాన్ని ఖండిస్తున్నామని అన్నారు.
తెలంగాణలో ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నికలు హాట్ టాపిక్. ఉప ఎన్నికల ప్రచారానికి మరో వారం రోజులు మిగిలి ఉంది. దీంతో.. బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ లు వేగం పెంచాయి. ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ అయితే మంత్రులను, ఎమ్మెల్యేలను మునుగోడుకు పంపి ఉప ఎన్నికల్లో విజయం సాధించాలని ప్రయత్నాలు వేగవంతం చేసింది.
కాంగ్రెస్ మాజీ నేత విజయ్ సింగ్ మంకోటియా మంగళవారం భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కమల తీర్థం పుచ్చుకున్నారు.
Mallikarjun Kharge: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఆ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే ఎన్నికైన విషయం విధితమే. ప్రత్యర్థి అభ్యర్థి శశిథరూర్‌పై 84శాతం ఓట్ల తేడాతో ఖర్గే విజయం సాధించారు.
బుద్ధ భవన్ లో కోదండరాం మౌన దీక్ష చేపట్టారు. తెలంగాణ జన సమితి పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. మునుగోడులో జరగుతున్న ప్రభుత్వ అక్రమాలు, ఎన్నికల నియమాల ఉల్లంఘన పై తెలంగాణ జన సమితి పార్టీ అధినేత, ప్రోఫెసర్ కోదండరాం మౌన దీక్ష చేపట్టారు.
మునుగోడు ఉపఎన్నికల నేపథ్యం తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఉపఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య దూరం బహిర్గతం అవుతోంది. తాజాగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మునుగోడు ఉపఎన్నిక ప్రచారం జోరందుకుంది. గెలిచేందుకు ప్రధాన పార్టీల ప్రచారం ఊపందుకుంది. విమర్శలు, ప్రతివిమర్శలతో రాజకీయం మరింత హీటెక్కింది. మునుగోడు ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి డిపాజిట్ కూడా దక్కదని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు.
ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఏఐసిసి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డి కి సపోర్ట్ చేయాలని కాంగ్రెస్ కార్యకర్తకు ఫోన్ చేసిన ఆడియో వైరల్ కావడం పై ఎఐసిసి సిరీయస్ అయ్యింది. ఎందుకు చర్యలు తీసుకోకూడదో 10 రోజుల్లో సమాధానం చెప్పాలని AICC నోటీస్ లో పేర్కొంది.
Foreign Funding Licence Of Gandhis NGOs Cancelled: గాంధీ కుటుంబానికి చెందిన రెండు ఎన్జీవోలు రాజీవ్ గాంధీ ఫౌండేషన్(ఆర్జీఎఫ్), రాజీవ్ గాంధీ ఛారిటబుల్ ట్రస్ట్(ఆర్జీసీటీ)ల ఎఫ్సీఆర్ఏ లైసెన్సులను రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం. విదేశీ విరాళాల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణపై ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్(ఎఫ్సీఆర్ఏ) కింద కేంద్రం ఈ రెండు ఎన్జీవోలపై చర్యలు తీసుకుంది. ఈ అవకతవకలపై సీబీఐ దర్యాప్తు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ, సీబీఐ…