ఢిల్లీలోని లుటియన్స్లో ప్రభుత్వం కేటాయించిన బంగ్లాను కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఖాళీ చేశారు. ఆయన తన తల్లి సోనియా గాంధీతో కలిసి జన్పథ్లోని నివాసంలో కొంతకాలం ఉంటారు. రాహుల్ గాంధీ ఎంపీగా అనర్హత వేటు పడిన తర్వాత తన అధికారిక బంగ్లాను ఖాళీ చేయమని అధికారులు కోరారు.
పరువు నష్టం కేసులో దోషిగా తేలడంతో ఎంపీగా అనర్హత వేటు పడిన కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ శుక్రవారం తన అధికారిక నివాసం నుండి తన వస్తువులన్నింటినీ తరలించారు. ఎంపీగా తనకు కేటాయించిన బంగ్లా నుంచి గాంధీ శుక్రవారం సాయంత్రం తన మిగిలిన వస్తువులను తరలించినట్లు వర్గాలు తెలిపాయి.
ల్యాండ్ డీల్ కేసులో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రకు క్లీన్ చిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. రాబర్ట్ వాద్రా సంస్థ రియల్టీ దిగ్గజం డీఎల్ఎఫ్కు భూమిని బదలాయించడంలో ఎలాంటి నిబంధనలను ఉల్లంఘించలేదని పంజాబ్, హర్యానా హైకోర్టు పంజాబ్ ప్రభుత్వానికి తెలిపింది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తి రేపుతున్నాయి. ఇప్పటికే నామినేషన్ల పర్వం ముగిసింది. అభ్యర్థులు పోటాపోటిగా ప్రచారం చేస్తున్నారు. ఇక, ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ నామినేషన్ను ఈసీ ఆమోదించింది.
సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని బీఆర్ఎస్ సమ్మేళనంలో మంత్రి హరీష్ రావు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై మండిపడ్డారు. కాంగ్రెస్ వాళ్లు ఢిల్లీలో ఉన్నోళ్లకు గులాంగిరి చేస్తారని, బీజేపీ వాళ్లు గుజరాత్ పెద్దలకు గులాంగిరి చేస్తారని.. కానీ బీఆర్ఎస్ వాళ్లు తెలంగాణ ప్రజలకు గులాం గిరి చేస్తారని మంత్రి అన్నారు.
పరువు నష్టం కేసులో తనకు విధించిన శిక్షపై స్టే విధించాలంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన పిటిషన్ను సూరత్ సెషన్స్ కోర్టు కొట్టివేసిన పెద్దగా ఆందోళన చెందడం లేదు. గురువారం రాహుల్ గాంధీ ఢిల్లీలో హల్ చల్ చేశారు. ఢిల్లీలోని ముఖర్జీ నగర్ ప్రాంతంలో విద్యార్థులతో సమావేశమయ్యారు.