2017లో రాహుల్ గాంధీ సభ సంగారెడ్డి లో నిర్వహించానని ఆ సభ ఖర్చు అంత నాదే అంటూ వ్యాఖ్యానించారు సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి. ఆ గుర్తింపు ఎక్కడ పాయే అని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర కర్ణాటక రాష్ట్రంలో ముగించుకొని తెలంగాణ రాష్ట్రంలో మొదటి రోజు మహబూబ్ నగర్ జిల్లలో అడుగు పెట్టడం జరిగిందని, కొన్ని రోజుల తర్వాత రాహుల్ గాంధీ గారి యాత్ర సంగారెడ్డి లో 25 కిలోమీటర్లు ముగించుకొని మహారాష్ట్ర రాష్ట్రానికి వెళ్ళడం జరిగిందన్నారు. సంగారెడ్డి లో ఉదయం 5 గంటలకే భారీ ఎత్తున రాహుల్ గాంధీ గారికి స్వాగతం పలకడం జరిగిందని ఆయన అన్నారు. ఈ ఖర్చు నాదేనని, స్వయంగా రాహుల్ గాంధీ గారే నన్ను పిలిచి చాలా బాగా చేశావాని అభినందించడం జరిగిందన్నారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఇలాంటి వ్యక్తులను కాంగ్రెస్ పార్టీ కోసం ఎలా వాడుకోవాలని ఇప్పుడున్న ఇన్ ఛార్జ్ లు తెలుసుకోకపోవడం చాలా దురదృష్టకారమన్నారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి.
Also Read : YSRCP: గాలి, నీరు నేనే కనిపెట్టానని కూడా చంద్రబాబు చెప్తారు..!
“మేము అనేక సార్లు సీనియర్ నాయకులతో ముఖ్యమైన విషయాలను చర్చించాము,” అని చెప్పుకొచ్చారు. ఇఫ్తార్ పార్టీకి హాజరైన పార్టీ అగ్ర నాయకుడితో తన ఆలోచనలను పంచుకున్నాడు. పాత రోజుల్లో లాగా గాంధీభవన్‌లో కూర్చోలేకపోతున్నట్లు, ఉండలేకపోతున్నట్లు కూడా ఆయన చెప్పారు.ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు జగ్గారెడ్డి లేఖ విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మునుపటిలా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీభవన్‌లో ప్రశాంతత కరువైందన్నారు. తన మనసులో ఎన్నో బాధలు ఉన్నాయని, వాటిని చెబితే ఏమౌతుందో.. చెప్పకపోతే ఏమవుతుందోనని ఆందోళన ఉందని జగ్గారెడ్డి తెలిపారు.