కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్ ఈరోజు కాంగ్రెస్లో చేరిన కొన్ని గంటల తర్వాత ఆయన తన నియోజకవర్గానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఈ క్రమంలో జగదీష్ షెట్టర్ సతీమణి శిల్పా భావోద్వేగానికి గురయ్యారు.
దేశంలో 2021 జనాభా లెక్కలను త్వరగా నిర్వహించాలని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ప్రధానిని డిమాండ్ చేశారు. జనాభా గణనలో కులాన్ని అంతర్భాగంగా చేయాలని అన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు.
Jagadish Shettar: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల ముందు కీలక పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ టికెట్ నిరాకరించడంతో మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్ ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కర్ణాటకలో ప్రముఖ లింగాయత్ నాయకుడు, ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన 2012 నుండి 2013 వరకు రాష్ట్రానికి 15వ ముఖ్యమంత్రిగా పనిచేశారు. బెంగళూరులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, కాంగ్రెస్ నేతలు రణదీప్ సూర్జేవాలా, సిద్ధరామయ్య సమక్షంలో…
Jagadish Shettar: బీజేపీ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్ కు బీజేపీ టికెట్ నిరాకరించడంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధం అయ్యారు. ఈ రోజు(సోమవారం) ఉదయం ఆయన బెంగళూర్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. నిన్న ఆయన బీజేపీ పార్టీకి రాజీనామా చేశారు.
Minister Harish Rao: కర్ణాటక ఎన్నికలకు కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలతో పాటు ప్రజలు కూడా ఈ ఎన్నికలను చాలా ఆసక్తిగా చూస్తున్నారు. ఈ ఎన్నికలు 2024 సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్స్ గా భావిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా మంత్రి హరీష్ రావు కర్ణాటక ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక రాస్ట్రంలో తామంతా వెళ్లి ప్రచారం చేస్తామని అన్నారు. కర్ణాటకలో మంచి ప్రభుత్వం రావాలని కోరుకున్నారు.…
Minister Jagadish Reddy: 25 ఏళ్లుగా నరేంద్ర మోదీ నాయకత్వంలో ఉన్న గుజరాత్ రాష్ట్రానికి ఒక్కటంటే ఒక్క అవార్డు రాలేదని విమర్శించారు మంత్రి జగదీష్ రెడ్డి. కోదాడ పట్టణ బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన బీజేపీపై విమర్శలు గుప్పించారు.
Minister Harish Rao: భారత దేశంలో తెలంగాణ తప్పా ఏ రాష్ట్రం కూడా ముస్లింలకు రంజాన్ పండగ కానుకలను అందించలేదని, గత ప్రభుత్వాలు ముస్లింలకు పండగ కానుకను అందించలేదని మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్ధిపేటలోని కొండ భూదేవి గార్డెన్స్ లో పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ పండుగ కానుకలను హరీష్ రావు పంపిణీ చేశారు. రాష్ట్రంలో హిందువులు, ముస్లింలు, క్రైస్తవుల పండగలకు సరుకులు అందిస్తున్నారమని ఆయన వెల్లడించారు.
Bhatti Vikramarka: కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క మంత్రి హారీష్ రావుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల నిజామాబాద్ ఆస్పత్రిలో జరిగిన సంఘటనను ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. ఆస్పత్రుల్లో దయనీయ పరిస్థితులు ఉన్నాయని అన్నారు. హరీష్ రావు వైద్యారోగ్య శాఖ, ఆర్థిక శాఖను వదిలేసి భజన శాఖను తీసుకున్నట్లు ఉన్నారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రిని అడిగి హరీష్ రావు భజన శాఖను తీసుకోవాలని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నిజామాబాద్ ఆసుపత్రిలో పేషెంట్లు స్ట్రేచర్లు లేక కాళ్లు పట్టుకుని గుంజుకుపోవాల్సిన…