మేఘా పర్మార్.. మధ్యప్రదేశ్ నుండి మౌంట్ ఈవెంట్ శిఖరాన్ని చేరుకున్న మొదటి మహిళ. ఆమె పేరును 'బేటీ బచావో బేటీ పడావో' కార్యక్రమం, రాష్ట్ర డెయిరీ బ్రాండ్ సాంచి అంబాసిడర్గా తొలగించబడిన తరువాత రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
కర్ణాటకలో విజయం అనంతరం దేశంలో తమ సత్తా చాటేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. దేశంలో బీజేపీని గద్దె దించేందుకు తమ అస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. ఇదిలా ఉండగా.. ఈ ఏడాది చివరలో జరగనున్న మధ్యప్రదేశ్ ఎన్నికలకు ఇప్పటి నుంచి హామీల వర్షం కురిపించి ప్రజలను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది.
Siddaramaiah: సిద్ధరామయ్యను ముఖ్యమంత్రి అభ్యర్థిగా, డీకే శివకుమార్ ను డిప్యూటీ సీఎం అభ్యర్థిగా కాంగ్రెస్ అధిష్టానం ఈ రోజు ప్రకటించింది. ఢిల్లీ నుంచి ఇద్దరు నేతలు ఈ రోజు సాయంత్రం బెంగళూర్ చేరుకున్నారు. బెంగళూర్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ శాసనసభాపక్షం(సీఎల్పీ) మీటింగ్ నిర్వహించారు.
Karnataka CM swearing-in ceremony: కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. 224 స్థానాల్లో ఏకంగా 135 స్థానాలను గెలుచుకుంది. అయితే గెలిచిన తర్వాత సీఎం పీఠం కోసం సిద్దరామయ్య, డీకే శివకుమార్ మధ్య తీవ్ర పోటీ ఎదురైంది. నాలుగు రోజుల హస్తినలో చర్చల తర్వాత సిద్దరామయ్యను కాంగ్రెస్ అధిష్టానం సీఎంగా ప్రకటించింది. డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ ను కాంగ్రెస్ అధిష్టానం ఒప్పించింది. మే 20న బెంగళూర్ లో ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది.
Karnataka: కర్ణాటకలో కాంగ్రెస్ భారీ ఆధిక్యంతో అధికారంలో వచ్చింది. గత నాలుగు రోజులుగా ప్రభుత్వ ఏర్పాటు, సీఎం ఎంపికపై ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానం విస్తృతంగా చర్చలు నిర్వహించింది. చివరకు సీఎంగా సిద్దరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ ను ప్రకటించింది. వీరిద్దరు కూడా శనివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ సీనియర్ నేత జీ పరమేశ్వర పార్టీ అధిష్టానికి హెచ్చరికలు చేశారు.
Karnataka: కర్ణాటక ప్రజలు విద్యుత్ బిల్లులు కట్టేందుకు ససేమిరా అంటున్నారు. కర్ణాటక వ్యాప్తంగా పలు జిల్లాలో ఇదే విధంగా ప్రజలు స్పందిస్తున్నారు. ఇందుకు కారణం కాంగ్రెస్ ఇచ్చిన హామీ. ఇటీవల ఆ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చింది.
Karnataka Politics: కర్ణాటక పొలిటికల్ డైలామాకు తెరపడింది. సీఎంగా సిద్ధరామయ్య శనివారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ ఉండనున్నారు. దాదాపుగా 4 రోజులుగా ఢిల్లీలో జరుగుతున్న చర్చలకు తెరపడింది. అయితే చివరి వరకు తనకు సీఎం పీఠం తప్పా ఏది ఆమోదయోగ్యం కాదని చెబుతున్న