New Parliament Inauguration: భారత ప్రజాస్వామ్య చరిత్రలో మహత్తర ఘట్టం ప్రారంభం కాబోతోంది. కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనం ఈ రోజు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగ ప్రారంభం కాబోతోంది.
Sengol: కొత్త పార్లమెంట్ భవనంలో స్పీకర్ పోడియం ముందు ప్రతిష్టించబోయే రాజదండాన్ని(సెంగోల్)ని ఆధీనం పూజారులు శనివారం ప్రధాని నరేంద్రమోడీకి అందచేశారు. ఈ రోజు చెన్నై నుంచి ఢిల్లీకి బయలుదేరిని తమిళ వేదపండితులు ప్రధాని మోడీకి ఈ దండాన్ని అందించారు. శనివారం సాయంత్రం ప్రధాని నివాసానికి చేరుకున్న వేద పండితులు ఆయన్ని ఆశ్వీర్వదించారు. రేపు ఉదయం 8.30-9.00 గంటల మధ్య పార్లమెంట్ లోక్ సభ ఛాంబర్ లో సెంగోల్ ను ఏర్పాటు చేస్తారు.
Bandi Sanjay: పోలీసులతో బెదిరిస్తామనే నమ్మకంతో ఖమ్మం లీడర్లు ఉన్నారని.. బీఆర్ఎస్ పోటుగాళ్లు ఎమ్మెల్యేలు, మంత్రులు కాక ముందే వారి చరిత్ర తెలుసని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.
Mallu Bhatti Vikramarka: ప్రాజెక్టుల పేరుతో పాలమూరు జిల్లాలో లక్షల కోట్ల అవినీతి జరిగిందని, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్న విధంగా తయారైందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. కృష్ణానదిపై ఈ పదేళ్లలో కొత్త ప్రాజెక్టు కట్టి ఒక్క ఎకరానికైనా నీరు ఇచ్చారా..?
Priyank Kharge : కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కుమారుడు, కర్ణాటకలోని చిత్తాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రియాంక్ ఖర్గే ప్రకటన దుమారం రేపుతోంది. ఈ ప్రకటనలో ఆర్ఎస్ఎస్ను నిషేధించాలని ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
Congress: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చి మే 30తో 9 ఏళ్లు పూర్తయ్యాయి. ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టి 9 ఏళ్లు గడుస్తున్న సందర్భంగా కాంగ్రెస్ ‘9 ఏళ్లు, 9 ప్రశ్నలు’ పేరుతో ఒక పత్రాన్ని విడుదల చేసింది. బీజేపీ హాయాంలో జరిగిన ద్రోహానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది.