Uttar Pradesh: వివాదాాస్పద నేత, సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ)కి చెందిన ఉత్తర్ ప్రదేశ్ నాయకుడు స్వామి ప్రసాద్ మౌర్య ఇటీవల హిందూమతంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఇది రాజకీయ దుమారాన్ని రేపాయి. ‘హిందూమతం ఒక బూటకం’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గతంలో ‘రామచరిత్ మానస్’ను కూడా దూషిస్తూ పలు వ్యాఖ్యలు చేశారు.
ఇదిలా ఉంటే హిందూ మతంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు స్వామి ప్రసాద్ మౌర్య నాలుక కోసేస్తే రూ. 10 లక్షల నగదు ఇస్తానని యూపీకి చెందిన కాంగ్రెస్ నేత రివార్డు ప్రకటించారు. యూపీ మొరాదాబాద్ లోని కాంగ్రెస్ పార్టీకి చెందిన మానవహక్కుల విభాగం చైర్మన్ గా ఉణ్న పండిట్ గంగారామ్ శర్మ ఈ రివార్డును ప్రకటించారు. రివార్డును ప్రకటిస్తూ ఆయన రాసిన లేఖ ఇప్పుడు వైరల్ గా మారింది.
Read Also: Rice Export: ఆ దేశానికి బియ్యం ఎగుమతి చేసేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
హిందూ మతం బూటకం, మోసం అంటూ మౌర్య ఇటీవల ట్విట్టర్ లో పలు కామెంట్స్ చేశారు. సమాజంలో అన్ని అసమానతలకు బ్రహ్మనవాదమే కారణమని ఆయన విమర్శించారు. హిందూ అనే మతమే లేదని, ఈ దేశంలో దళితులు, గిరిజనులు, వెనబడిన ప్రజలను ట్రాప్ చేయడానికి కుట్ర జరుగుతోందని, బ్రహ్మణ మతాన్ని హిందూమతంగా ముద్రవేస్తున్నారని, హిందూ మతం ఉంటే గిరిజనులకు గౌరవం దక్కేది, దళితులను , వెనుకబడిన వారిని గౌరవించేదని వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదం అయ్యాయి.
ఈ ఏడాది జనవరిలో హిందూ మతగ్రంథమైన ‘రామచరిత్ మానస్’ అర్థం లేనిదిగా పేర్కొంటూ దాన్ని నిషేధించాలని డిమాండ్ చేశారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలకు ఎస్పీ పార్టీ దూరంగా ఉంది. స్వామి ప్రసాద్ మౌర్య చేసిన ఈ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని, ఇది పార్టీకి సంబంధించింది కాదని ఎస్పీ నేత మనోజ్ కుమార్ పాండే సోమవారం అన్నారు.